AP Government : వాలంటీర్లకు మనసారా సెల్యూట్ : సీఎం జగన్

ఉగాది సందర్భంగా వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరిస్తుంది. పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డుల ప్రదానం చేయనుంది.

AP Government : వాలంటీర్లకు మనసారా సెల్యూట్ : సీఎం జగన్

Ap Government

AP government honoring volunteers : ఉగాది సందర్భంగా వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరిస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టింది. పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డుల ప్రదానం చేయనుంది. రూ.10 వేల నుంచి రూ.30 వేల మధ్య నగదు ప్రోత్సాహకాలు అందించనుంది.

రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్‌ సోమవారం (ఏప్రిల్ 12, 2021) ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం జగన్‌ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వాలంటీర్లు మానవత్వంతో సేవలందిస్తున్నారని ప్రశంసించారు. వాలంటీర్లు వాడవాడలా సేవలందిస్తున్నారని కొనియాడారు. వాలంటీర్లకు మనసారా సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌లు అందిస్తున్నారని తెలిపారు.

వాలంటీర్లు 32 రకాల సేవలు అందిస్తున్నారని చెప్పారు. వాలంటీర్లలో 53 శాతం మంది మహిళే కావడం గర్వకారణమన్నారు. కోవిడ్ సమయంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. అవినీతి, వివక్షకు తావులేకుండా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వృద్ధురాలు హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే..మన వాలంటీర్ అక్కడికి వెళ్లి పెన్షన్ ఇచ్చాడని గుర్తు చేశారు.

50 ఇళ్లను వాలంటీర్‌ తన కుటుంబంగా భావిస్తున్నారని తెలిపారు. పార్టీకి ఓటు వేయకపోయినా వాలంటీర్లకు సేవా మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర అవార్డులు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది అవార్డులు అందిస్తామన్నారు. ఎవరు విమర్శించినా పట్టించుకోవద్దన్నారు. ప్రభుత్వం వాలంటీర్లకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.