గుంటూరులో కంత్రీ పోలీస్.. దొంగలతో చేతులు కలిపి..

గుంటూరులో కంత్రీ పోలీస్.. దొంగలతో చేతులు కలిపి..

A Constable Joins Hands With Thieves In Guntur

పోలీసోళ్లు దొంగలను పట్టుకుంటారు.. ఇది కామన్.. పోలీసోళ్లు.. దొంగలు కలిసిపోతే.. ఇంకేముంది.. విద్వంసమే కదా? ఏపీలోని ఓ పోలీస్ దొంగల ముఠాతో చేతులు కలుపి.. దోపిడీలు చేయించి దొంగిలించిన సొమ్ముతో ఆస్తులు కూడబెట్టాడు. చివరికి విషయంలో వెలుగులోకి రావడంతో కటకటాల పాలయ్యాడు. గుంటూరు జిల్లాలో కంత్రీ పోలీస్ వ్యవహారం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.

గుంటూరు జిల్లాలో కంత్రీ కానిస్టేబుల్ బస్వరాజ్ దొంగలతో చేతులు కలిపి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. దోచిన సొత్తు జీర్ణం చేసుకోలేక చివరకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాతో పాటు పోరుగు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడింది దొంగల ముఠా. ఒంటరి మహిళలనే టార్గెట్‌ చేసి నగలు దొంగిలిచడంలో ఈ ముఠా ఆరితేరింది.

ఇంట్లో ఒంటరిగా ఉన్నవారి నుంచి బంగారు నగలు తెంపి పరారిపోతుంటుంది ఈ ముఠా. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులు సురేశ్, సైదారావు, సాగర్ బాబును అరెస్ట్ చేశారు. సురేశ్ పిడుగరాళ్లకు చెందిన వ్యక్తి కాగా.. సరేశ్‌పై పలు కేసులు ఉన్నాయి. సాగర్‌ బాబు ఇప్పటికే జైలులో ఉన్నాడు. మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. వీరి నుంచి రెండు లక్షల విలువగల బంగారం స్వాధనం చేసుకున్నారు.

ఈ ముఠాతోనే కానిస్టేబుల్ బస్వరాజ్ చేతులు కలిపాడు. సురేశ్ దొంగిలించిన సొత్తును కానిస్టేబుల్ బస్వరాజ్ అమ్మి అందులో కమీషన్ తీసుకునే వాడని జిల్లా ఎస్పీ వెల్లడించారు. బస్వరాజ్‌ ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సత్తెనపల్లిలో దొంగతనం కేసులో ఈయన పేరు వచ్చిందని, ఇప్పటికే సస్పెషన్‌లో ఉన్నాడని చెప్పారు. వ్యసనాలకు అలవాటుపడి, తక్కువ టైమ్‌లో మనీ సంపాదించాలని దొంగలతో చేతులు కలిపాడని పోలీసులు చెప్పారు.