One Man Show: పొలార్డ్ తుఫాను ఇన్నింగ్స్.. ముంబైదే మ్యాచ్..
One Man Show By Keiron Pollard: వరుసగా పరాజయాలతో ఉన్న ముంబై ఇండియన్స్.. విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టగా.. ముంబై ఇండియన్స్ ఇరగదీశారు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. మొయిన్ అలీ, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడులు అర్ధ సెంచరీలతో చెలరేగారు.
అంబటి రాయుడు(72 నాటౌట్: 27 బంతుల్లో 4×4, 7×6 ) మెరుపు అర్ధశతకంతో.. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించి జట్టు స్కోరును 200 దాటించాడు. డుప్లెసిస్(50: 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్ అలీ(58: 36 బంతుల్లో 5×4, 5×6) లతో చెలరేగారు. ముంబై బౌలర్లలో పొలార్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ మొదట్లో ఆచితూచి ఆడినా.. వరుస వికెట్లు కోల్పోయి గెలవడం కష్టం అనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి పోలార్డ్ పవర్ఫుల్ బ్యాటింగ్‌తో కేవలం 17 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో యాభై పరుగులు చేసి, మొత్తం 34బంతుల్లో 87పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.