హెన్రిచ్ క్లాసెన్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్.. మనోడి క్రేజ్ మామూలుగా లేదు!

పవర్-హిట్టింగ్‌ బ్యాటింగ్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ క్రేజ్ తాజా తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో అమాంతం పెరిగిపోయింది.

హెన్రిచ్ క్లాసెన్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్.. మనోడి క్రేజ్ మామూలుగా లేదు!

Heinrich Klaasen mobbed by SRH fans (screenshots taken from viral video)

Heinrich Klaasen : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో దుమ్మురేపుతున్నాడు. పవర్-హిట్టింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. సంచలన ఫామ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. SRH విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. క్లాసెన్ చేసిన పరుగుల్లో బౌండరీల కంటే సిక్సర్లే ఎక్కువ ఉన్నాయంటేనే అర్థమవుతోంది.. అతడి పవర్-హిట్టింగ్‌తో ఏ రేంజ్‌లో ఉందో.

క్లాసెన్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 189.32 స్ట్రైక్ రేట్‌తో 337 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. SRH తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల లిస్టులో అతడు ముందున్నాడు. ఇప్పటివరకు క్లాసెన్ 31 కొట్లగా.. తన టీమ్‌మేట్‌ అభిషేక్ శర్మ 28 సిక్సర్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. శివమ్ దూబే 26 సిక్సర్లు బాదాడు.

పవర్-హిట్టింగ్‌తో క్లాసెన్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా SRH అభిమానులు అతడిని ఆకాశానికెత్తున్నారు. సోషల్ మీడియాలో అతడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా క్లాసెన్ తన సహచరులతో కలిసి హైదరాబాద్‌లోని ఒక షాపింగ్ మాల్‌కి వెళ్లగా అభిమానులు చుట్టుముట్టారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.

Also Read: అక్కడుంది కింగ్ కోహ్లీ.. అయినా పరుగు తీస్తావా..! ఫలితం ఇలానే ఉంటది మరి.. వీడియో వైరల్

”క్లాసెన్.. క్లాసెన్” అంటూ అరుస్తూ షాపింగ్ మాల్‌ని హోరెత్తించారు. గట్టిగా అరవొద్దని అభిమానులను క్లాసెన్ వేడుకోవాల్సి వచ్చింది. ఫ్యాన్స్ అతి చేయడంతో ఈ SRH వికెట్ కీపర్ కొంచెం నిరుత్సానికి గురైనట్టు కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంత మంది అభిమానులను SRH మేనేజ్‌మెంట్‌ ఎలా అనుమతించిందని విపిన్ తివారీ అనే నెటిజన్ ఒకరు ప్రశ్నించారు.

Also Read: లక్నో జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు దూరమైన ఫాస్ట్ బౌలర్.. అసలేం జరిగిందంటే?

SRH ప్రస్తుతం IPL 2024 పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. సోమవారం జరగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తలపడనుంది.