దక్షిణాదిలో ఎలుక మాంసం కిలో రూ.200

  • Published By: veegamteam ,Published On : August 24, 2019 / 06:35 AM IST
దక్షిణాదిలో ఎలుక మాంసం కిలో రూ.200

Updated On : August 24, 2019 / 6:35 AM IST

మన దేశంలో ఎలుక అంటేనే ఆమడ దూరం పరిగేడతాం.. మరి అలాంటి ఎలుక మాంసం కూడా తినే వాళ్ల గురించి ఎప్పుడైన విన్నారా? మన దేశంలో చేపలు, చికెన్, మటన్ ఎలాగైతే కొంటారో.. అలా ఓ దేశంలో ఎలుక మాంసం కూడా ఎగబడి మరీ కొంటారంట. మనం చికెన్ బిర్యానీ ఎంత ఇష్టంగా తింటామో.. వాళ్లు ఎలుక బిర్యానీని అంతే ఇష్టంగా తింటారట. మరి అది ఏ దేశమో.. అక్కడ ఎలుకకు ఎందుకు అంత డిమాండ్ ఉందో తెలుసుకుందామా?

వివరాలు… తమిళనాడు రాష్ట్రములోని తంజావూరు జిల్లాలో ప్రస్తుతం కరవు తీవ్రతతో పంటలు సాగు చేయలేదు. పొలాలు బీడుగా ఉండటంతో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంది. కొంత మంది ఎలుకలను పట్టుకొని రోడ్డు పక్కన అమ్ముతున్నారు. అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా ఎలుక మాంసంని ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఎలుక మాంసంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ అమ్మేస్తున్నారు. ఆరు ఎలుకలను రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అంతేకాదు పంట పొలాల్లో దోరికే  ఎలుకల మాంసం అయితే బాగుంటుందని ఇతర ప్రాంతాల వారు కూడా అక్కడికి వచ్చి ఎలుక మాంసం కొనుకుని వెళ్తున్నారు.  

ఇక ప్రతీ ఆదివారం మాత్రమే ఈ ఎలుక మాంసం దోరుకుంతోందట. అందుకని జనాలు కూడా ఎగబడతారు. ఛీ.. ఎలుకల మాంసం, పంది మాంసం తినడం ఏంటి చెండాలంగా… అని చాలామంది అనుకోవచ్చు. కానీ అక్కడి ప్రజలకు అదే జీవనోపాధి. వాళ్లు మూడు పూటలు తినాలంటే ఎలుకలను పట్టుకొచ్చి ఆ మార్కెట్ లో అమ్మాల్సిందే.