జైట్లీ కన్నుమూత : సుప్రీంకోర్టు అడ్వకేట్ గా కెరీర్ ప్రారంభం

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 07:54 AM IST
జైట్లీ కన్నుమూత : సుప్రీంకోర్టు అడ్వకేట్ గా కెరీర్ ప్రారంభం

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా ఉన్నారు. అంతేగాకుండా దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయవాదిగా సేవలందించారు. ఎన్నో కేసులు వాదించారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారాయన. 

1952 డిసెంబర్ 28న జన్మించారు. జైట్లీ ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ జేవియర్స్ స్కూల్లో విద్యనభ్యసించారు. శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 1977లో ఢిల్లీ యూనివర్సిటీ న్యాయవిద్యాలో డిగ్రీ పట్టా అందుకుని.. అదే ఏడాది నుంచి ప్రాక్టీస్ ప్రారంభించారు. 1989లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1998లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. 

1952 ఢిల్లీలో జన్మించిన అరుణ్‌ జైట్లీ
1991లో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఎన్నిక
1999లో బీజేపీ అధికార ప్రతినిధి పని చేసిన జైట్లీ
2000లో  గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక 
2000 సంవత్సరంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ
2006, 2012లోనూ రాజ్యసభ మెంబర్‌గా పని చేసిన జైట్లీ
2014 ఎన్నికల్లో అమృత్‌సర్‌ నుంచి ఓటమి
2014లో కేంద్రమంత్రిగా బాధ్యతల నిర్వహణ
ఎన్‌డిఏ హయాంలో ఆర్థిక మంత్రిగా జైట్లీ
2018లో అమెరికాలో సర్జరీ
అనారోగ్య కారణంతో 2019 ఎన్నికలకు  దూరం
రెండేళ్లనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ
Read More : జైట్లీ జీవితంలో క్రికెట్