ఆగస్ట్ 31 లోపు పెండింగ్ చలానాలు కట్టకుంటే.. క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

  • Published By: vamsi ,Published On : August 27, 2019 / 08:39 AM IST
ఆగస్ట్ 31 లోపు పెండింగ్ చలానాలు కట్టకుంటే.. క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

కొత్తగా వస్తున్న వాహనదారుల చట్టం.. ఎన్నో అనుమానాలు.. ఇప్పటికే భారీగా ఫైన్ లు వెయ్యనున్నారు అనే విషయం మాత్రం అందరికీ అర్థం అయ్యింది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు పాడాల్సిందే అని అంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఇదిలా ఉంటే.. కొత్త వాహన చట్టం ప్రకారం పాత చలానాలు రెట్టింపు అవుతాయి. పాత చలానాలు కొత్త చలనాల అమౌంట్ కి ఆటోమేటిక్ గా మారిపోతాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా..? మీరు కట్టాల్సిన చలాన్ లు పెండింగ్ లో ఉన్నాయా..? అయినా రోడ్డుపై వెళ్తున్నారు ? పరిస్థితులు మారాయి. చలాన్ లు వెంటనే కట్టేయండి. ఈ నెలాఖరులోగా అంటే 31-8-2019లోగా కట్టండి లేకుంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త చట్టం ప్రకారం.. Software Updation అయిన వెంటనే కొత్త ధరలలోకి పాత చలాన్లు మారిపోతాయి. అంటూ వార్త వైరల్ అవుతుంది.

ఈ ప్రకటనను తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విడుదల చేసినట్లుగా కూడా సదరు వార్తలో ఉంది. దీంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ పోలీసులను కోరడంతో దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1వ తేదీలోపు చెల్లించకపోతే అవన్నీ కొత్త చట్టం ప్రకారం పెరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ వట్టి పుకార్లు అని వెల్లడించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మాత్రం నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు కట్టక తప్పదని చెబుతున్నారు.