6-12 గంటలు గ్యాప్ ఉంటేనే : ATMలో డబ్బులు డ్రా చేస్తున్నారా?

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? జాగ్రత్త. చేతిలో కార్డు ఉంది కదా? అని ఎడపెడా గికుతానంటే కుదరదు.

  • Published By: sreehari ,Published On : August 27, 2019 / 10:14 AM IST
6-12 గంటలు గ్యాప్ ఉంటేనే : ATMలో డబ్బులు డ్రా చేస్తున్నారా?

Updated On : August 27, 2019 / 10:14 AM IST

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? జాగ్రత్త. చేతిలో కార్డు ఉంది కదా? అని ఎడపెడా గికుతానంటే కుదరదు.

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? జాగ్రత్త. చేతిలో కార్డు ఉంది కదా? అని ఎడపెడా గికుతానంటే కుదరదు. రూల్స్ మారబోతున్నాయి. ఎప్పడు పడితే అప్పుడు ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయలేరు. ఇకపై ప్రతి రెండు లావాదేవీలకు మధ్య కచ్చితమైన సమయం తప్పనిసరి కానుంది. కనీసం 6 గంటల నుంచి 12 గంటల మధ్య సమయం ఉండాలి. అప్పుడే ఏటీఎం నుంచి మనీ ట్రాన్స్ జెక్షన్ చేయడం కుదురుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పలు ఏటీఎంల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎనీ టైమ్ మనీ అంటూ రాత్రి పగలు అంటూ తేడా లేకుండా మనీ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. 

ఏటీఎం సెంటర్లలో డబ్బులు విత్ డ్రా చేసే వ్యక్తులను మాటల్లో పెట్టి ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి డబ్బులు కాజేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏటీఎం మోసాలను నివారించే దిశగా బ్యాంకర్లు కొత్త విధానాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఏటీఎం మోసాలను తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం (SLBC) ఏటీఎంలో ట్రాన్స్ జెక్షన్ సమయాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. రెండు లావాదేవీల మధ్య కనీసం 6 గంటల నుంచి 12 గంటల సమయం ఉండేలా మార్పులు చేయాలని యోచిస్తోంది. అదేగాని అమల్లోకి వస్తే.. ఇకపై ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేయాలంటే.. రెండు లావాదేవీల మధ్య కనీసం 6 గంటల గ్యాప్ ఉండాల్సిందే. 

‘ఏటీఎంల్లో జరిగే మోసాలు ఎక్కువగా రాత్రుల్లోనే జరుగుతుంటాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు దొంగతనాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఏటీఎంల్లో లావాదేవీలపై ఒక నిర్దిష్టమైన సమయాన్ని అమల్లోకి తీసుకొస్తే.. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టొచ్చునని ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సీఈఓ, ఎండీ, ఢిల్లీ SLBC కన్వినర్ ముఖేశ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సేవల శాఖ ఆదేశాల మేరకు బ్యాంకుల కోసం బాటమ్స్-అప్ ఐడిషన్‌లో భాగంగా బ్యాంకు ఆర్థిక సర్వీసులపై గతవారమే 18 బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏటీఎంలో మనీ విత్ డ్రా విషయంలో లావాదేవీల మధ్య సమయాన్ని తగ్గించడంపై సుదర్ఘీంగా చర్చ జరిగింది. 

ఈ ప్రతిపాదన అంగీకరిస్తే మాత్రం.. నిర్ణీత కాల పరిమితిలో ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడం కుదరదు. 2018-19 మధ్యకాలంలో ఏటీఎం మోసాల కేసులు 179 వరకు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ఏటీఎం మోసాలు జరిగిన నగరాల్లో ఢిల్లీ రెండోవది కాగా, 233 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఇటీల కాలంలో క్లోనింగ్ కార్డుల మోసాలు అధికంగా పెరుగుతున్నాయి. 2017-18 ఏడాదిలో 911 కేసులతో పోలిస్తే 2018-19లో 980 కేసులు పెరిగినట్టు ఓ రిపోర్టు తెలిపింది.