వార్నిష్ కోటింగ్ : త్వరలో కొత్త రూ.100 నోట్లు 

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త వంద కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది.

  • Published By: sreehari ,Published On : August 29, 2019 / 02:58 PM IST
వార్నిష్ కోటింగ్ : త్వరలో కొత్త రూ.100 నోట్లు 

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త వంద కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త వంద కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ ట్రయల్ ప్రాతిపాదికన వార్నిష్ (మెరుగు నూనె కోటింగ్) పూతతో కూడిన కరెన్సీ నోట్లను తీసుకురానుంది. 2018-19 వార్షిక రిపోర్టులో సెంట్రల్ బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించింది. వార్నిష్ నోట్లు తీసుకురావడం ద్వారా కరెన్సీ జీవితకాలాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది.

గత ఏడాదిలో నోట్ల భద్రత ముద్రణపై ఖర్చు రూ.4వేల 912 కోట్లతో పోలిస్తే.. జూలై 1, 2018 నుంచి జూన్ 30, 2019 సమయంలో కరెన్సీ భద్రత ముద్రణపై రూ.4వేల 811 కోట్లు ఖర్చు అయినట్టు ఆర్బీఐ తెలిపింది. భారతీయ బ్యాంకు నోట్ల జీవితకాలాన్ని పెంపును సుసాధ్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు 2017-18 వార్షిక రిపోర్టులో పేర్కొంది. వార్నిషింగ్ బ్యాంకు నోట్లతో ఎక్కువ కాలం కరెన్నీ మన్నిక ఉండేందుకు దోహదపడుతుందని అంతర్జాతీయ వర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి. 

బ్యాంకు నోట్లను తిరిగి ముద్రించాల్సిన అవసరాన్ని తగ్గించడమే కాకుండా భద్రత ముద్రణ ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చునని తెలిపింది. 2019 మార్చి ఆఖరు నాటికి చెలామణీలో ఉన్న మొత్తం రూ.10, రూ.100 కరెన్సీ నోట్లు 47.2 శాతం ఉండగా.. మార్చి 2018 ఆఖరి నాటికి 51.6 శాతం మాత్రమే చెలామణీలో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో చెలామణీలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం 17శాతానికి పెరగగా, 2018-19 సమయంలో 6.2 శాతం నుంచి వరుసగా రూ.21.1 లక్షల కోట్లు, 10వేల 875.9 కోట్లకు చేరాయి. 

మార్చి 2018 నాటికి చెలామణీలో ఉన్న రూ.500, రూ.2వేల బ్యాంకు నోట్ల మొత్తం కలిపి విలువ 80.2 శాతంగా నమోదైంది. మార్చి 2019 నాటికి 82.2 శాతానికి పెరిగింది. అదే ఏడాదిలో చెలామణీలో ఉన్న రూ.5వందల నోట్లు విలువ 42.9 శాతం నుంచి 51శాతానికి వేగంగా పెరిగింది. బ్యాంకు నోట్ల విలువను గుర్తించేందుకు వీలుగా మెకానిజం, డివైజ్ లను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు 2018-19 వార్షిక రిపోర్టులో ఆర్బీఐ తెలిపింది.