చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. వైసీపీపై పవన్‌ చేస్తున్న విమర్శలను ట్విటర్‌ వేదికగా ఆయన ఖండించారు.

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 08:29 AM IST
చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ

Updated On : May 28, 2020 / 3:45 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. వైసీపీపై పవన్‌ చేస్తున్న విమర్శలను ట్విటర్‌ వేదికగా ఆయన ఖండించారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. వైసీపీపై పవన్‌ చేస్తున్న విమర్శలను ట్విటర్‌ వేదికగా ఆయన ఖండించారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం నోరు మెదపని పవన్‌ ఇప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదంతా టీడీపీ ఆటలో భాగమేనంటూ విమర్శించారు. పవన్‌.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అన్న సంగతి బహిరంగ రహస్యమే అన్నారు.
 
టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై పవన్‌ ఎప్పుడూ నోరు విప్పలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పవన్‌ వ్యుహత్మకంగా మౌనం వహించారని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఒకటే అనేది అందరికి తెలిసిన విషయమేనని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్తు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే చూశారని విమర్శించారు.

 

Also Read : ఎంత పని చేసింది : పాము కారణంగా రూ.4లక్షలు నష్టం