Jeff Bezos : నాసాకు బెజోస్ బంపర్ ఆఫర్.. మాకు అప్పగిస్తే 15వేల కోట్ల డిస్కౌంట్..!

ఇందుకోసం బెజోస్ ఓ బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించాడు. బ్లూ ఆరిజన్ కు హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టును అప్పగిస్తే 15వేల కోట్లు డిస్కౌంట్ ఇస్తానంటూ ఎనౌన్స్ చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Jeff Bezos : నాసాకు బెజోస్ బంపర్ ఆఫర్.. మాకు అప్పగిస్తే 15వేల కోట్ల డిస్కౌంట్..!

Blu Arizen

Jeff Bezos : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా 2024లో చంద్రునిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన హ్యుమన్ ల్యాండింగ్ సిస్టం హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టును ఇటీవల ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు అప్పగిస్తూ ఒప్పదం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ 2.9 బిలియన్ డాలర్లు. అయితే కొన్ని సంస్ధలు ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే అంతరిక్ష యానం చేసి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ గా మారిన బెజోస్, హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎలాన్ మస్క్ నుండి హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టు తన బ్లూ ఆరిజిన్ అప్పగించాలని నాసా ముందు ప్రతిపాదనలుంచాడు.

ఇందుకోసం బెజోస్ ఓ బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించాడు. బ్లూ ఆరిజన్ కు హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టును అప్పగిస్తే 15వేల కోట్లు డిస్కౌంట్ ఇస్తానంటూ ఎనౌన్స్ చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్టును స్పేస్ ఎక్స్ కు అప్పగించటాన్ని నిరసిస్తూ బ్లూ ఆరిజన్ తోపాటు, డైనెటిక్స్ సంస్ధలు అక్కడి సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారాన్ని అమెజాన్ సంస్ధ వ్యవస్ధాపకుడు జెఫ్ బెజోస్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బ్లూ ఆరిజిన్ సంస్ధకు హ్యుమన్ ల్యాండింగ్ సిస్టం ప్రాజెక్టు వచ్చేలా చేసేందుకు పెద్ద ఎత్తున పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. బ్లూ ఆరిజన్ సంస్ధ తయారు చేసే బ్లూ మూన్ ల్యాండర్ లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచేలా రూపొందించనున్నట్లు ప్రకటించింది. ల్యూనార్ ఐస్ నుండి సైతం ఇంధనాన్ని సమకూర్చుకునే సాంకేతికతను వినియోగించనున్నారు.

నాసా ప్రాజెక్టును దక్కించుకోవటం ద్వారా పట్టునిలుపుకునేందుకు బ్లూ ఆరిజిన్ సంస్ధ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే క్రూ డ్రాగన్ ను స్పెస్ ఎక్స్ అంతరిక్ష కేంద్రానికి పంపింది. అదే క్రమంలో బ్లూ ఆరిజన్ తాను రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అతరిక్ష కేంద్రానికి పంపింది. భవిష్యత్తులో నిధుల కొరత లేకుండా ప్రాజెక్టు ముందుకు సాగాలంటే హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టును తనకు ఇవ్వటమే మేలని బేజోస్ అంటున్నారు.