LPG price hike!: సామాన్యుడిపై భారం.. మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు

అసలే అధిక ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడికి మరో దెబ్బగా, పెట్రోలియం మరియు గ్యాస్ రిటైల్ సంస్థలు 19 కిలోల కమర్షియల్, వాణిజ్య LPG సిలిండర్ల ధరలను 73రూపాయల 50పైసలు పెంచాయి.

LPG price hike!: సామాన్యుడిపై భారం.. మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు

Gas

LPG price hike!: అసలే అధిక ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడికి మరో దెబ్బగా, పెట్రోలియం మరియు గ్యాస్ రిటైల్ సంస్థలు 19 కిలోల కమర్షియల్, వాణిజ్య LPG సిలిండర్ల ధరలను 73రూపాయల 50పైసలు పెంచాయి. 14.2 కిలోల దేశీయ సిలిండర్ రేట్లు మాత్రం మారలేదు. సవరించిన ధరలు ఆదివారం (ఆగస్టు 1) నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెంపుతో, 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00 వద్ద రిటైల్ అవుతోంది. ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1579.50కి పెరిగింది.

ఇంతలో, 19కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతా మరియు చెన్నైలలో వరుసగా 1629.00 మరియు 1761.00 రూపాయలకు పెరిగింది. చమురు మరియు గ్యాస్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తున్నాయి.

ఆగష్టు 2021లో దేశీయ LPG సిలిండర్ రేట్లు మారలేదు, జూలై 1 న ధరలు రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెంపుతో, 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 834.50, ముంబైలో రూ. 834.50, కోల్‌కతాలో రూ. 861 మరియు చెన్నైలో రూ.850.50గా ఉంది.

2021 లో, LPG గ్యాస్ సిలిండర్ల ధరలను 138.50 రూపాయలు పెంచారు. జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ రూ. 694 వద్ద రిటైల్ అవుతోంది. గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెండింతలు పెరిగాయి.

ఉదాహరణకు, ఢిల్లీలో 2014 మార్చి 1 న 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 410.50. అయితే, అదే సిలిండర్ ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 834.50 వద్ద రిటైల్ అవుతోంది. ఇక కోల్‌కతాలో రూ.861, ముంబైలో రూ.864.50, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887 ధర పలుకుతోంది.