Pooja Hegde: నా ప్రయాణం తలచుకుంటే గర్వంగా అనిపిస్తుంది
పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో బన్నీ-త్రివిక్రమ్ మ్యాజికల్ మూవీ అల వైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూజ వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండా దూసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా బడా బడా సినిమాలతో హైలీ పెయిడ్ హీరోయిన్ గా మారిపోయింది.
Pooja Hegde: పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో బన్నీ-త్రివిక్రమ్ మ్యాజికల్ మూవీ అల వైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూజ వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండా దూసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా బడా బడా సినిమాలతో హైలీ పెయిడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అన్ని బాషలలో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది.
ఈ బ్యూటీ ఖాతాలో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, బీస్ట్ చిత్రాలు ఉండగా.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న బీస్ట్ షూటింగ్ దశలో ఉంది. ఇక బాలీవుడ్ లో సర్కస్, భాయిజాన్ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇంతగా సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్న ఈ బుట్టబొమ్మ తన సక్సెస్ చూసి తానే గర్వంగా ఫీలవుతుందట. అంతేకాదు, తన సక్సెస్ చాలామందికి లెసన్ కావాలంటుంది.
ఎంచుకున్న రంగం ఏదైనా అంకితభావంతో పనిచేయడంతో పాటు ఓర్పు చాలా అవసరమంటున్న ఈ మంగళూరు సొగసరి.. వైఫల్యాల్లో సహనాన్ని కలిగి ఉండటమే తన విజయాలకు కారణమని చెప్పింది. అధైర్యపడకుండా, కష్టపడే తత్వాన్ని విడిచిపెట్టకుండా నాదైన సమయం కోసం ఎదురుచూస్తుంటే చివరకు విజయాలు వరించాయని చెప్పింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి రావడం గర్వంగా ఉందన్న పూజ.. నా ప్రయాణాన్ని తరచి చూసుకుంటే ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉందనిపిస్తోందని చెప్పింది. కథల ఎంపికలో పాత్ర నిడివి గురించి కంటే.. కథతో పాటు పాత్ర చిత్రణ బాగుండేలా ఎంచుకుంటానన్న ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రతిభావంతులైన దర్శకులు, గొప్ప నిర్మాణ సంస్థలను మిస్ చేసుకోనని చెప్పింది.