అమీజాక్సన్ బేబి బాయ్ ని చూశారా?
బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్ సోమవారం (సెప్టెంబర్ 23, 2019)న మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన సంతోషాన్ని వెంటనే సోషల్ మీడియా లో షేర్ చేసింది.
ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మా ఏంజెల్ ఆండ్రియాకు స్వాగతం అంటూ తన ఒడిలో ఉన్న కుమారుడిని జార్జ్ ముద్దాడుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇక ఈ ఏడాది మే లో అమీ – జార్జ్ల నిశ్చితార్థం జరిగింది. బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తల్లిదండ్రులు అయ్యాక పెళ్లి చేసుకుంటామని తెలిపారు. మరి ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.