జస్టిస్ ఫర్ ప్రియాంక: నోట్ల రద్దుపై చూపిన శ్రద్ధ చట్టాలపై పెట్టి ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు

డాక్టర్ ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 08:16 AM IST
జస్టిస్ ఫర్ ప్రియాంక: నోట్ల రద్దుపై చూపిన శ్రద్ధ చట్టాలపై పెట్టి ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు

డాక్టర్ ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే

డాక్టర్ ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే క్రమంలో దుర్మార్గులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. 45 నిమిషాల పాటు రాక్షసకాండ కొనసాగించారు. బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడ్డారు. ప్రియాంక రెడ్డి తన స్కూటీ కోసం ఎదురుచూస్తున్న ప్రదేశం నుంచి ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో హెల్ప్‌ అని అరిచినప్పటికీ.. వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఎవరికీ వినిపించలేదు. తర్వాత నిందితులు ప్రియాంక నోరు నొక్కి లాక్కెళ్లారు. మద్యం మత్తులో ఉండడంతో దుండగులు ఆమెపై లైంగిక దాడి చేశారు. అప్పటికే స్పృహ కోల్పోవడం, నోరు, ముక్కును మూసేయడంతో ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది. 

ప్రియాంక హంతకులను చంపేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ నలుగురు మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలని లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని అంటున్నారు. లేదంటే మాకు అప్పగిస్తే మేమే చంపేస్తామని జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

student 2

”ఆ నరరూప రాక్షసులను వెంటనే ఉరి తీయాలి. వారిని కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరక్కుండా ఉంటాయి. నేరం చేయాలంటే భయపడేలా నిందితులను శిక్షించాలి”-విద్యార్థిని

student1

”ఆడపిల్లలకు భద్రత కావాలి. కఠిన చట్టాలు తేవాలి. తప్పు చేస్తే వెంటనే శిక్ష విధించాలి” విద్యార్థిని

hang1

”జంతువులకన్నా హీనంగా ప్రవర్తించిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి ఘోరాలు తగ్గుముఖం పడతాయి. నోట్ల మార్పిడిలో పెట్టిన శ్రద్ధ చట్టాల మార్పిడిలో పెట్టి ఉంటే ఇంతమంది మహిళలు, ఆడపిల్లలు బలయ్యేవారు కాదు.”-మహిళా సంఘం నేత

student 3

”భారత దేశంలో ఆడపిల్లలను ఎందుకు కన్నాము అని బాధపడే రోజు రాకుండా ఉండాలంటే కచ్చితంగా చట్టాల్లో మార్పు చేయాలి. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి”-విద్యార్థిని