Kuwait : విజయ్ ‘బీస్ట్’ సినిమాని బ్యాన్ చేసిన ఆ దేశం..
బీస్ట్ సినిమాకి ఓ దేశంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సినిమాని కువైట్‌లో రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేశారు. కువైట్ సమాచార మంత్రిత్వ శాక బీస్ట్ సినిమాని నిషేధించింది.
Beast : తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది. బీస్ట్ సినిమాని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ట్రైలర్ కూడా అందర్నీ మెప్పించింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.
మన ఇండియన్ సినిమాలని వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే బీస్ట్ సినిమాకి ఓ దేశంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సినిమాని కువైట్‌లో రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేశారు. కువైట్ సమాచార మంత్రిత్వ శాక బీస్ట్ సినిమాని నిషేధించింది. ఈ సినిమాలో పాక్ టెర్రరిస్టులతో పాటు ఇస్లామిక్ టెర్రరిజం వంటి అంశాలు ఉండటం వల్లే కువైట్ దేశం ఈ సినిమాని బ్యాన్ చేసింది.
Yashoda : నాగచైతన్య, అఖిల్‌కి పోటీగా సమంత.. రివేంజ్ అంటున్న నెటిజన్లు..
కువైట్ లో సెన్సార్ బోర్డు చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ టెర్రరిస్ట్ లాంటి అంశాలని, నెగిటివ్ అంశాలని సినిమాల్లో చూపిస్తే ఒప్పుకోరు. అలాంటి సినిమాలని అక్కడ ప్రదర్శించరు. గతంలో కూడా చాలా ఇండియన్ సినిమాలు అక్కడ బ్యాన్ అయ్యాయి. ఇటీవల విష్ణు విశాల్ హీరోగా వచ్చిన ‘FIR’ సినిమా కూడా టెర్రరిస్టు నేపథ్యంలోనే ఉండటంతో ఆ సినిమాని కూడా బ్యాన్ చేశారు. తాజాగా విజయ్ ‘బీస్ట్’ సినిమాని కువైట్ లో బ్యాన్ చేయడంతో విజయ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
#Beast is banned by the Ministry of Information in #Kuwait
Reason could be Portrayal of Pak, Terrorists or Violence
Recently Indian Movies #Kurup and #FIR were banned in #Kuwait
Of late, #Kuwait Censor is becoming very strict in GCC compared to other countries in the region
— Ramesh Bala (@rameshlaus) April 5, 2022