ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు మహేశ్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు

పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు.

ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు మహేశ్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు

Kasu Mahesh Reddy

ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేసిన చేశారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఏపీలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై టీడీపీ దాడులు చేసిందని అన్నారు.

పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. తాము 60కి పైగా పోలింగ్ స్టేషన్లలో రిపోలింగ్ జరపాలని కోరామని వివరించారు. వెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రిపోలింగ్ జరపాలని కోరినట్లు తెలిపారు.

ఈసీ స్పందించకపోతే రిగ్గింగ్ పై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తామని చెప్పారు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారని అన్నారు. అందుకే హింస చెలరేగిందని తెలిపారు. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీలో ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్ ని గెలిపించాలని నిర్ణయించారని తెలిపారు.

మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. ముందస్తు భద్రత కల్పించాలని అడిగినట్లు తెలిపారు.

తెలంగాణలో ఎక్కడాలేని ఫ్యాక్షన్ సంస్కృతి ఇక్కడ నెలకొంది: కేటీఆర్