Anup Rubens : ‘మనం’ పదేళ్లు.. అనూప్ రూబెన్స్ స్పెషల్ ఆల్బమ్..

మనం సినిమా రిలీజయి నేడు మే 23తో పదేళ్లు పూర్తవుతుంది.

Anup Rubens : ‘మనం’ పదేళ్లు.. అనూప్ రూబెన్స్ స్పెషల్ ఆల్బమ్..

Anup Rubens Best Musical Album Akkineni Family Special Film Manam Completed 10 Years

Anup Rubens : జై, గౌతమ్ SSC, ప్రేమ కావాలి, మనం, ఇష్క్, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా, గుండెజారి గల్లంతయ్యిందే, టెంపర్, గోపాల గోపాల, బంగార్రాజు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, హార్ట్ ఎటాక్.. ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించారు అనూప్ రూబెన్స్. తన పాటలతో, తన బ్యాక్ గ్రౌండ్ సినిమాలతో ఈ సినిమా హిట్స్ లో భాగమయ్యారు. ఈ సినిమాల పాటలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ముఖ్యంగా మనం సినిమా సాంగ్స్ అక్కినేని అభిమానులకు, ప్రేక్షకులకు ఒక స్పెషల్ ఫీల్ ఇస్తాయి. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడం ఆయన అభిమానులకు ఆ సినిమా మరింత స్పెషల్.

మనం సినిమా రిలీజయి నేడు మే 23తో పదేళ్లు పూర్తవుతుంది. 2014 లో ఇదే డేట్ లో మనం సినిమా రిలీజయి సెన్సేషనల్ హిట్ సాధించింది. అక్కినేని అన్ని తరాల హీరోలు ఈ సినిమాలో కనపడి అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. దీంతో ఈ సినిమా అక్కినేని కుటుంబానికి కూడా ఎంతో స్పెషల్ గా మిగిలిపోయింది. మనం సినిమా రిలీజయి పదేళ్లు పూర్తవడంతో రెండు రేలుగు రాష్ట్రాల్లో నేడు కొన్ని చోట్ల ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమా గురించి మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు.

Also Read : Getup Srinu : ఆ సినిమా కోసం కష్టాలు పడ్డ గెటప్ శ్రీను.. ఆఖరికి కార్‌లో బట్టలు మార్చుకొని..

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ కూడా మనం మ్యూజిక్ ని ప్లే చేసి వీడియో షేర్ చేశారు. మనం సినిమాలో ప్రతి పాట అనూప్ రూబెన్స్ అద్భుతంగా ఇచ్చారు. నేడు థియేటర్స్ లో అనూప్ రూబెన్స్ ఇచ్చిన మనం సాంగ్స్ మరోసారి సందడి చేస్తున్నాయి.

సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, గౌరీ రోనంకి, ఏకే ఎంటర్టైన్మెంట్స్, సుమంత్, ఆది సాయి కుమార్‌.. ఇలా పలువురు సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు. చేతిలో దాదాపు డజను పైగా ఆసినిమాలతో అనూప్ రూబెన్స్ దూసుకుపోతున్నాడు. మరిన్ని మంచి పాటలు ప్రేక్షకులకు అందివ్వడానికి సిద్దమవుతున్నాడు. నేడు మనం మూవీ యూనిట్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్ లో సాయంత్రం 6.30 గంటల షోని అభిమానులతో కలిసి చూడబోతున్నారు.