biggest plant: ఆస్ట్రేలియా తీరంలో అతిపెద్ద మొక్క.. ఎన్ని కిలోమీటర్లో తెలుసా..!

ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను తాజాగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని సముద్రంలోపల ఈ మొక్క పెరుగుతోందని తెలిపారు. పెర్త్ పట్టణానికి 800 కిలోమీటర్ల దూరంలోని షార్క్ బే దగ్గర ఈ మొక్క ఉంది.

biggest plant: ఆస్ట్రేలియా తీరంలో అతిపెద్ద మొక్క.. ఎన్ని కిలోమీటర్లో తెలుసా..!

Biggest Plant

biggest plant: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను తాజాగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని సముద్రంలోపల ఈ మొక్క పెరుగుతోందని తెలిపారు. పెర్త్ పట్టణానికి 800 కిలోమీటర్ల దూరంలోని షార్క్ బే దగ్గర ఈ మొక్క ఉంది. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం ఇదో సీ గ్రాస్.. అంటే సముద్రపు గడ్డి జాతికి చెందిన మొక్క.

home guards’ salary: హోం గార్డుల జీతం తొమ్మిది వేలేనా: సుప్రీం కోర్టు ప్రశ్న

దీన్ని రిబ్బన్ వీడ్‌గా పిలుస్తున్నారు. ఇది దాదాపు 4,500 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది. అది కూడా ఒకే విత్తనం నుంచి ఈ మొక్క పెరుగుతుండటం విశేషం. ఇది దాదాపు 200 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అంటే ఈ మొక్క విస్తీర్ణం 20,000 ఫుట్‌బాల్ మైదానాలతో సమానం. అరుదైన ఈ మొక్కకు సంబంధించిన జన్యు పటాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం మొక్క నుంచి సేకరించిన 18,000 భాగాల జన్యుపటాలను పరిశీలించి, ఒక ఫింగర్ ప్రింట్ తయారు చేశారు. ఈ మొక్క అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. ఎలాంటి ఉష్ణోగ్రతలోనైనా, ఎలాంటి ఉప్పు సాంద్రతలోనైనా పెరుగుతుంది. తక్కువ కాంతిలో కూడా మనుగడ సాగిస్తుంది.

Population Control Bill: జనాభా నియంత్రణకు త్వరలో చట్టం: కేంద్ర మంత్రి

సాధారణంగా కాంతి లభ్యత తక్కువగా ఉంటే మొక్కలు పెరగవు. కానీ, ఈ మొక్క ఏ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది. సాధారణంగా ఇవి సంవత్సరానికి 35 సెంటీమీటర్లు పెరుగుతాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు రాయల్ సొసైటీ బీ అనే జర్నల్‌లో ప్రచురించారు.