NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌బస్టర్ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే....
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌బస్టర్ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆచార్య చిత్రంతో కెరీర్లో ఫస్ట్ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న కొరటాల శివ, ఈసారి తారక్‌తో కలిసి విధ్వంసం సృష్టించేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమా కోసం తారక్‌ను బరువు తగ్గాల్సిందే అంటూ కండీషన్ పెట్టాడట.
NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!
అటు తారక్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా, ప్రమోషన్స్‌లో కాస్త బొద్దుగా కనిపించడంతో.. ఇప్పుడు బరువు తగ్గాలని డిసైడ్ అయ్యాడు. ఇక స్క్రిప్టు పనులకు సంబంధించి అంతా ఫైనల్ అయ్యాకే తారక్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్కు దిగుతాడని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే తాజాగా తారక్, తన బాడీని స్లిమ్’గా మార్చేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. కొరటాలతో సినిమా పనులకు సంబంధించి పలు మార్పులు చేర్పులు చేసి స్క్రిప్టును ఫైనల్ చేశాడట తారక్. దీంతో ఇప్పుడు తారక్ తన బాడీని ట్రాన్స్‌ఫార్మ్ చేసేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నట్లు తెలుస్తోంది.
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
మరికొద్ది రోజుల్లోనే స్లిమ్‌గా మారిన తారక్ మనముందుకు రాబోతున్నాడని ఆయన స్ననిహితులు అంటున్నారు. ఇక ఒక్కసారి ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తి చేశాడంటే, కొరటాల కూడా ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు తమ కాంబినేషన్లో రాబోయే సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి తారక్ తన దూకుడు షురూ చేసినట్లే అని అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.