పవన్ వాయిస్ ఓవర్‌తో ‘అశ్వథ్థామ’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కానున్న ‘అశ్వథ్థామ’..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కానున్న ‘అశ్వథ్థామ’..
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్.. ‘అశ్వథ్థామ’.. ఈ సినిమాకు నాగశౌర్య కథనందించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రిలీజ్‌కి తక్కువ సమయం (జనవరి 31) ఉండడంతో ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది మూవీ టీమ్. తాజాగా ఓ ఇంటర్వూలో నాగశౌర్య ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
* మా ఫ్రెండ్ వాళ్ల చెల్లికి జరిగిన ఇన్స్‌డెంట్ నన్ను బాగా కదిలించింది. నిజంగా జరిగింది అంటే కూడా మీరెవ్వరూ నమ్మరు. నేను వాళ్ళ దగ్గరనుండి పర్మీషన్ తీసుకునే ఇలా కూడా జరుగుతుంది అని మీకు చూపించబోతున్నాను. ప్రతి రోజు అలాంటి ఒక కేస్ కనిపిస్తుంటుంది. అందుకే కొంత మంది అమ్మాయిలకైనా ఇలా కూడా జరగొచ్చు కొంచెం జాగ్రత్త తీసుకోండి అని కొంచెం కమర్షియల్ వేలో చెప్పడం జరిగింది. నాకు చెల్లెలు లేదు కానీ ప్రతి సంవత్సరం నాకు రాఖీ కట్టే ప్రియ అనే అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అనుకొని ఈ కథ రాశాను.
*మహా భారతంలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించిన వ్యక్తి ‘అశ్వథ్థామ’. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలాంటిదే కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ‘గోపాల గోపాల’ సినిమాలో ‘అశ్వథ్థామ’ గురించి చెప్పే డైలాగ్, ఈ ‘అశ్వథ్థామ’ కి ఇన్స్పిరేషన్. అందుకే శరత్ మరార్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ డైలాగ్ వాయిస్ ఓవర్ సినిమా స్టార్టింగ్‌లో పెట్టడం జరిగింది.
*అవసరాల శ్రీనివాస్ గారితో చేస్తున్న సినిమా ఇప్పటికే 3 షెడ్యూల్స్ అయిపోయాయి. అలాగే నందిని రెడ్డి గారు నా కోసం ఒక కొత్తరకం ప్రేమకథ రాస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై వేరే హీరోతో సినిమా ఉంటుంది. దానికోసం ఓ లవ్ స్టోరీ నేనే రెడీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయితే వేరే హీరోని అప్రోచ్ అవుతా. ప్రస్తుతానికి అయితే ‘అశ్వథ్థామ’ రిలీజ్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను..