Racist Attack Video: ‘నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో… భారతీయుడివి మా దేశంలో ఎందుకు ఉన్నావు?’ అంటూ పోలండ్‌లో జాత్యహంకార దాడి
పోలాండ్ లో ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. ఓ భారతీయుడిపై అమెరికా వ్యక్తి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘నేను అమెరికాకు చెందిన వాడిని. నీలాంటి వారు ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. నువ్వు పోలాండ్ లో ఎందుకు ఉన్నావు? చెప్పు? పొలాండ్ ను ఆక్రమించుకోగలనని అనుకుంటున్నావా? నీ సొంత దేశానికి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు?’’ అని ప్రశ్నించాడు.
Racist Attack Video: పోలాండ్ లో ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. ఓ భారతీయుడిపై అమెరికా వ్యక్తి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘నేను అమెరికాకు చెందిన వాడిని. నీలాంటి వారు ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. నువ్వు పోలాండ్ లో ఎందుకు ఉన్నావు? చెప్పు? పొలాండ్ ను ఆక్రమించుకోగలనని అనుకుంటున్నావా? నీ సొంత దేశానికి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు?’’ అని ప్రశ్నించాడు.
‘‘మా దేశాలను మీ వాళ్ళు ఎందుకు ఆక్రమించుకుంటున్నారు? మీకు మీ దేశం ఇండియా ఉంది కదా? శ్వేత జాతీయులు ఉండే ప్రాంతాలకు మీరు ఎందుకు వస్తున్నారు? మీ దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోరు? ఇంకొకరిపై ఎందుకు ఆధారపడుతున్నారు? మా జాతిని మీరు ఊచకోత కోస్తున్నారు. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. మేము మిమ్మల్ని యూరప్ లో ఉండనివ్వదలుచుకోవడంలేదు. పోలండ్ పోలిష్ లకు మాత్రమే. నువ్వు పోలిష్ వి కాదు’’ అని భారతీయుడిపై ఆ వ్యక్తి విరుచుకుపడ్డాడు.
పోలాండ్ లోని ఏ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుందన్న విషయంపై స్పష్టత లేదు. జాత్యహంకార వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, అమెరికాలోని టెక్సాస్, డల్లాస్ లో ఇటీవలే జాత్యహంకార ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నలుగురు భారతీయ అమెరికన్ మహిళలను తిడుతూ ఓ మెక్సికన్-అమెరికన్ యువతి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారని, ఇండియన్లు అంతా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆ మెక్సికన్-అమెరికన్ యువతి జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనను మరవకముందే పోలండ్ లో ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
Shameful display of racism directed towards an ethnic minority Indian in Poland ? pic.twitter.com/9kQBHBLWB8
— Wasiq Wasiq (@WasiqUK) September 2, 2022
Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం