Manchu Vishnu: జిన్నా జాతరకు అందరూ ఆహ్వానితులే అంటోన్న మంచు విష్ణు
యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండగా, పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
Manchu Vishnu: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండగా, పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
Manchu Vishnu: గరికపాటి కామెంట్స్ పైన స్పందించిన మంచు విష్ణు..
ఇక ఈ సినిమాలో ఇద్దరు హాట్ బ్యూటీలు నటిస్తుండటం, ఇండస్ట్రీలోని పలువురు కమెడియన్స్ నవ్వులు పూయించేందుకు రెడీ కావడంతో జిన్నా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే జిన్నా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్‌ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
Manchu Vishnu: ఇచ్చిన హామీలు నెరవేర్చాం.. మా భవనంపై మంచు విష్ణు ఏమన్నాడంటే?
జిన్నా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో అక్టోబర్ 16న సాయంత్రం 5.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాతో విష్ణు మరోసారి తనదైన సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్లు నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.