Manchu Vishnu: ఇచ్చిన హామీలు నెరవేర్చాం.. మా భవనంపై మంచు విష్ణు ఏమన్నాడంటే?

‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో మంచు విష్ణు తన కార్యవర్గంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మంచు విష్ణు తాను అధ్యక్షుడిగా, తన ప్యానెల్ చేపట్టిన పనుల గురించి పలు విషయాలను వెల్లడించారు. తాను మా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏడాది కాలంలో తాను ఇచ్చిన హామీలు దాదాపు 90 శాతం పూర్తి చేసినట్లు మంచు విష్ణు పేర్కొన్నాడు.

Manchu Vishnu: ఇచ్చిన హామీలు నెరవేర్చాం.. మా భవనంపై మంచు విష్ణు ఏమన్నాడంటే?

Manchu Vishnu Press Meet On Completion Of One Year As MAA President

Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో మంచు విష్ణు తన కార్యవర్గంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మంచు విష్ణు తాను అధ్యక్షుడిగా, తన ప్యానెల్ చేపట్టిన పనుల గురించి పలు విషయాలను వెల్లడించారు. తాను మా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏడాది కాలంలో తాను ఇచ్చిన హామీలు దాదాపు 90 శాతం పూర్తి చేసినట్లు మంచు విష్ణు పేర్కొన్నాడు.

Manchu Vishnu : RRR చెత్త సినిమా అన్న తమిళ్ నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..

2021లో జరిగిన మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయని.. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ తెలుగు ప్రజలు ‘మా’ ఎన్నికలపై ఆసక్తి చూపారని మంచు విష్ణు తెలిపాడు. మా ఎన్నికల్లో గెలిచిన తాను, కేవలం అసోసియేషన్‌కే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా జవాబుదారుడినని.. అందుకే ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నాడు. ఇక అందరికీ సినిమాల్లో అవకాశాలు వచ్చేలా తాను చర్యలు తీసుకుంటున్నానని.. దీనికోసం ఓ ప్రత్యేక బుక్‌లెట్‌ను కూడా తయారు చేశామని.. ‘మా’ కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నామని, సంక్రాంతి తర్వాత దాన్ని ప్రవేశపెడతామని విష్ణు తెలిపాడు. ఈ యాప్ ద్వారా సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని.. ప్రొడక్షన్ సంస్థల్ని నేరుగా సంప్రదించవచ్చని.. మహిళల సంరక్షణ కోసం ఓ ప్రత్యేక కమిటీని తయారు చేసినట్లుగా మంచు విష్ణు తెలిపాడు.

Manchu Vishnu : నేను పది పుషప్స్ చేశాక దున్నపోతులా ఊహించుకుంటాను.. ట్రోల్ అవుతున్న మంచు విష్ణు ట్వీట్..

మా అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. మా అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని విష్ణు అన్నాడు. మా భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించానని.. ఫిల్మ్ నగర్‌కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నామని.. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు తాను ఖర్చు భరిస్తానని మంచు విష్ణు తెలిపాడు.