Yashoda: ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న యశోద.. వచ్చేది అప్పుడేనా?
స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సరోగసి నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథ ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో వారు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.
Yashoda: స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సరోగసి నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథ ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో వారు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.
Yashoda: సీక్వెల్‌కు రెడీ అవుతోన్న యశోద.. నిజమేనా?
ఇక యశోద సినిమాలో సమంత పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక థియేటర్ల వద్ద ఇంకా సందడి చేస్తున్న యశోద సినిమా, ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ నెలలోని రెండో శుక్రవారం నాడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ చేస్తుందట అమెజాన్ ప్రైమ్.
Yashoda: యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న యశోద
అయితే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు. కానీ, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డేట్‌ను అఫీషియల్‌గా మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో యశోద మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.