Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ మూవీ.. లేనట్టేనా..?
అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
Naga Chaitanya : ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నాగచైతన్య కొత్త మూవీ..
ఇక ఇప్పుడు ఈ హీరో తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే విషయంపై చిత్ర వర్గాల్లో మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. గీతగోవిందం, సర్కారు వారి పాట వంటి సినిమాలను తెరకెక్కించిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తన నెక్ట్స్ మూవీని చైతూతో చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్. కానీ, ఈ సినిమాను అనౌన్స్ చేసిన తరువాత, దీని ఊసే లేకుండా పోయింది.
ప్రస్తుతం చైతూతో చిత్రాన్ని పరశురామ్ పక్కనబెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చైతూతో ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుండీ అది వరుసగా వాయిదా పడుతుండటం.. ఆలస్యం అవుతుండటంతో పరశురామ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేగాక, గీత గోవిందం కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేయాలని పరశురామ్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మరి నిజంగానే పరశురామ్-చైతూ కాంబినేషన్ సినిమాను పక్కనబెట్టారా అనే విషయంపై అఫీషియల్‌గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.