Parasuram : మహేష్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా ఉందా??

యువత, ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి మంచి సినిమాలు అందించిన డైరెక్టర్ పరుశురాం గీతా గోవిందం సినిమాతో భారీ హిట్ కొట్టి మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి మరింత భారీ విజయం సాధించాడు. చిన్న సినిమాల స్థాయి నుంచి పెద్ద హీరోలతో..............

Parasuram : మహేష్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా ఉందా??

Parasuram wants to do movie with balakrishna

Parasuram :  యువత, ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి మంచి సినిమాలు అందించిన డైరెక్టర్ పరుశురాం గీతా గోవిందం సినిమాతో భారీ హిట్ కొట్టి మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి మరింత భారీ విజయం సాధించాడు. చిన్న సినిమాల స్థాయి నుంచి పెద్ద హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కు ఎదిగాడు డైరెక్టర్ పరశురామ్. అయినప్పటికీ నెక్స్ట్ మూవీని సెట్ చేసుకోవడంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తు్న్నాడు.

‘గీతగోవిందం’ మూవీ బ్లాక్ బస్టర్ తో వైడ్ రేంజ్ అప్రిసియేషన్ తెచ్చుకున్నాడు పరశురామ్. ఆ క్రెడిట్ తో నాగచైతన్యతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అంతా సిద్ధం చేసుకొని సెట్స్ కు వెళ్ళే టైమ్ లో మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో నుంచి పరశురామ్ కు పిలుపొచ్చింది. దాంతో చైతూ సినిమాను పక్కనపెట్టి ‘సర్కారు వారి పాట’ సినిమాని పట్టాలెక్కించాడు. సినిమా రిలీజై ఏడునెలలు దాటిపోయింది. అయినప్పటికీ పరశురామ్ ఇంకా తన నెక్స్ట్ మూవీ విషయంలో డైలమాలో ఉన్నాడు.

‘సర్కారువారి పాట’ మూవీ తర్వాత హోల్డ్ లో పెట్టిన నాగచైతన్య సినిమా పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే నాగచైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ‘కస్టడీ’ మూవీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. దీని తర్వాతైనా చైతూ పరశురామ్ సినిమాలో నటిస్తాడా లేదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పరశురామ్ హీరోల లిస్ట్ లోకి ఇప్పుడు బాలయ్య కూడా వచ్చి చేరారు.

Sivakarthikeyan : శివ కార్తికేయన్ సినిమాకి పని చేస్తున్న అవతార్ టీమ్.. నిజమేనా?

రీసెంట్ గా పరశురామ్ బాలకృష్ణకి ఓ స్టోరీ లైన్ వినిపించాడని, దానికి బాగా ఇంప్రెస్ అయిన బాలయ్య దాన్ని డెవలప్ చేయమన్నారని టాక్స్ వినిపించాయి. అయితే రెండు వారాల్లో పరశురామ్ బాలయ్యకి పూర్తి స్ర్కిప్ట్ నెరేట్ చేయబోతున్నాడని లేటెస్ట్ గా న్యూస్ వినిపిస్తుంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లోని సినిమా చేయబోతున్నారు. ఆపై బోయపాటి శ్రీను క్యూలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే నాటికి చాలా టైమ్ పడుతుంది. మరి పరశురామ్ తో ఒకవేళ బాలయ్య సినిమా ఉన్నా ఇప్పట్లో వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. మరి పరశురామ్ నెక్స్ట్ సినిమా ఏమవుతుందో చూడాలి.