Sivakarthikeyan : శివ కార్తికేయన్ సినిమాకి పని చేస్తున్న అవతార్ టీమ్.. నిజమేనా?

తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమా కోసం అవతార్ మూవీకి పని చేసిన బృందం పని చేయబోతుంది అని తెలుస్తుంది. అయలాన్ (ఏలియన్) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న శివ కార్తికేయన్ 22వ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా రాబోతుంది. ఏలియన్స్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా...

Sivakarthikeyan : శివ కార్తికేయన్ సినిమాకి పని చేస్తున్న అవతార్ టీమ్.. నిజమేనా?

Avatar Team for Sivakarthikeyan movie

Sivakarthikeyan : తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమా కోసం అవతార్ మూవీకి పని చేసిన బృందం పని చేయబోతుంది అని తెలుస్తుంది. వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న కార్తికేయన్ కి ప్రిన్స్ సినిమా బ్రేక్ వేసింది. తెలుగు దర్శకుడు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటా ఈ హీరో.

Siva Karthikeyan : సౌత్ సినిమాల సక్సెస్ పై స్పందించిన శివ కార్తికేయన్.. తెలుగు, తమిళ్ వాళ్ళు కలిసి మరిన్ని సినిమాలు చేయాలి..

అయలాన్ (ఏలియన్) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా రాబోతుంది. ఏలియన్స్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉంది. దీంతో ఈ మూవీపై ఆడియన్స్ లో ఉన్న ఆశక్తి కూడా పోయింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేసింది. అదేంటంటే ‘అవతార్ ది వే అఫ్ వాటర్’ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు అని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ తో పాటు ఒక ఏలియన్ కూడా మూవీ మొత్తం కనిపించనుంది అంటా, దీంతో చిత్ర యూనిట్ గ్రాఫిక్ వర్క్ కోసం అవతార్ సినిమా కోసం పని చేసిన వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు అని వినిపిస్తుంది. అయితే ఈ వార్తలుపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, శివ కార్తికేయన్ కి జంటగా నటిస్తుంది.