మాస్కులు కుడుతోంది మా అమ్మ కాదు- ఆ అమ్మకి నా కృతజ్ఞతలు..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 09:33 AM IST
మాస్కులు కుడుతోంది మా అమ్మ కాదు- ఆ అమ్మకి నా కృతజ్ఞతలు..

Updated On : April 27, 2020 / 9:33 AM IST

‘సమాజసేవలో మెగాస్టార్ తల్లి’ అనే న్యూస్ పేపర్ కథనంపై మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. ఆ కథనంలో ఉన్నది తన తల్లి కాదని, కానీ ఈ ఆపత్కాల సమయంలో ఆమె చేస్తున్న పనికి ఎంతో ముగ్ధుడినయ్యానని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 
కరోనాపై పోరులో చిరంజీవి తల్లి అంజనాదేవి భాగమయ్యారని, ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టి అవసరమైన వారికి అందజేస్తున్నారనే కథనాలు న్యూస్ పేపర్‌లోనే కాకుండా పలు ఛానళ్లలో కూడా దర్శనమివ్వడంతో.. దీనిపై చిరంజీవి స్పందించారు.

‘‘మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. కాగా హీరో రామ్ గురించి కూడా ఒక జాతీయ పత్రికలో కథనం రావడంతో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.