లాక్ డౌన్ 2.0 ఎత్తివేస్తే..ప్రజలు..ప్రభుత్వాలు ఏం చేయాలి ? 

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 04:45 AM IST
లాక్ డౌన్ 2.0 ఎత్తివేస్తే..ప్రజలు..ప్రభుత్వాలు ఏం చేయాలి ? 

లాక్ డౌన్ ఎత్తివేస్తే…ఎలా వ్యవహరించాలి ? ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయాలి ? ప్రస్తుతం దీనితో పాటు ఇతర అంశాలపై
హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే..2020, మే 03వ తేదీ దగ్గర పడుతోంది. కరోనా రాకాసి కారణంగా
భారతదేశ వ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

2020, మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ ముగుస్తోంది. దీంతో అందరి చూపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. కేంద్రం మే 03వ తేదీ వరకు కొనసాగించగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా..మే 07వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరి దీని తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనబోతోంది ? (తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలివే..కేంద్రం ప్రకటన)

లాక్ డౌన్ ఎత్తివేతపై బిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సడలింపులు ఇస్తూ..కొన్ని జాగ్రత్తలు
తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం పలు
చర్యలు తీసుకొంటోంది. కరోనా వైరస్ అంతగా లేని వారిని ఇంట్లోనే ఐసోలేషన్‌ ఉంచొచ్చని వెల్లడించింది. లాక్‌డౌన్‌ తర్వాత
ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనే సమర్థత, అనుభవం వైద్య ఆరోగ్య శాఖకు వచ్చిందని చెబుతున్నారు. 

ప్రభుత్వం..ప్రజలు ఏం చేయాలి…
ప్రజలు ఎక్కువగా తిరిగే..ప్రాంతాల్లో ఉండే వాటిని బంద్ చేయించాలి (సినిమా హాళ్లు, మాల్స్, రెస్టారెంట్లు). వైరస్ ఎక్కువగా
ఉండే ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించాలి. ప్రధానంగా మాస్క్ లు ధరించే విధంగా చూడాలి. వీలైనంతగా..ప్రభుత్వ, ప్రైవేటు కార్యలయాల్లో పని చేసే వారు ఇంటి నుంచే వర్క్ చేసే విధంగా చూడాలి. ఇక ఆఫీసుల్లో, క్యాంటీన్లలో దగ్గరదగ్గరగా కూర్చొవడం పై నిషేధం ఉంచాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. 

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..అమలు చేసేది మాత్రం ప్రజల చేతుల్లో ఉంటుంది. తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. ఎక్కువగా గుమికూడి ముచ్చట్లు చేయకూడదు. వృద్ధులు బయటకు రాకుండా ఉండడమే బెటర్. ఎవరికి వారు లాక్ డౌన్ పాటించాలి. 

Also Read | మెట్రోసిటీలు అన్నీ రెడ్ జోన్లే..: కేంద్ర ప్రభుత్వం