Custody Movie: నాగచైతన్య ‘కస్టడీ’ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా..?
అక్కినేని నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Naga Chaitanya Custody Movie: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా, పూర్తి కాప్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.
Custody Review : కస్టడీ ట్విట్టర్ రివ్యూ.. చైతూ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందట..
ఈ సినిమా వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ మూవీకి సంబంధించి ఇంకా ఓటీటీ రైట్స్ లాక్ కానందున ఈ సినిమా రిలీజ్ రోజున ఓటీటీ పార్ట్నర్ను రివీల్ చేయలేదు.
Custody Movie : 20 రోజులు నీళ్ళల్లోనే షూట్.. కస్టడీ సినిమాలో అదే హైలెట్..
అయితే, తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి కస్టడీ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్కు వస్తుందా అనేది చూడాలి.