కరెంటు మీటర్ బిల్లు ముట్టుకుంటే షాక్..ఎందుకు ? 

  • Published By: madhu ,Published On : May 5, 2020 / 06:16 AM IST
కరెంటు మీటర్ బిల్లు ముట్టుకుంటే షాక్..ఎందుకు ? 

కరెంటు మీటర్ బిల్లు చూసి షాక్ తింటున్నారు కొంతమంది వినియోగదారులు. ఎందుకంటే భారీగా బిల్లులు వస్తున్నాయి. తాము ఇంతకనం ఎక్కడ కరెంటు ఉపయోగించాం అని తలలు పట్టుకుంటున్నారు. దీనికంతటికి కరోనా కారణమని చెప్పవచ్చు. ఈ వైరస్ కారణంగా విద్యుత్ రీడింగ్ తీసుకోవడం లేదు. మార్చి నెలకు సంబంధించి..ఏప్రిల్ లో తీసే..స్పాట్ బిల్లింగ్ ను విద్యుత్ శాఖ నిలిపివేసింది. మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్ నెల వినియోగంతో కలిపి మే నెలలో బిల్లును జారీ చేస్తోంది విద్యుత్ శాఖ. 

దీని ఆధారంగా డిస్కంలు మేలో విద్యుత్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం కావడం..ఎండకాలం కావడం..తో కరెంటును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రెండు నెలలకు ఉపయోగించిన యూనిట్లను కలిపేస్తున్నారు. కేటగిరి మారిపోయి..బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయి. 

కొత్త ఛార్జీలు
కేటగిరి ఏ : 0-50 1.45, 51-75 2.60.  కేటగిరి బి :  0-50 2.60, 51-100 2.60. 101- 200 3.60. 201-225 6.90.
కేటగిరి సి : 0-50 2.65, 51-100 3.35. 101- 200 5.40. 201-300 7.10. 301-400 7.95. 401-500 8.50

500 యూనిట్లకు మించిన వినియోగంపై యూనిట్ కు రూ. 9.95

Also Read | 40 స్పెషల్ ట్రైన్స్ : వలస కార్మికులపై సీఎం కేసీఆర్ కరుణ