విశాఖ స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు రూ.కోటి చెక్కులు అందజేసిన మంత్రులు 

  • Published By: nagamani ,Published On : May 11, 2020 / 05:56 AM IST
విశాఖ స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు రూ.కోటి చెక్కులు అందజేసిన మంత్రులు 

Updated On : October 31, 2020 / 2:38 PM IST

విశాఖలో స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు మంత్రులు నష్టపరిహారాన్ని అందజేశారు. కోటి రూపాయల చెక్కులను అందజేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ అయి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘఘటనకు మొత్తం 12మంది మృతి చెందారు. వారిలో ఎనిమిదిమంది బాధిత కుటుంబాలకు మంత్రులు నష్టపరిహారాన్ని అందజేశారు. మరో నాలుగు కుటుంబాలకు త్వరలోనే పరిహారాన్ని అందజేస్తామని తెలిపారు.
ఈ క్రమంలో రేపటి నుంచి వార్డు వాలంటీర్ల ద్వారా గాయపడిన  ప్రతి వ్యక్తికి రూ.10వేలు అందిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభమైంది. 

బాధిత కుటుంబాలకు చెక్కులు అందించినవారిలో మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో 12మంది మృత్యువాత పడిన బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా సీఎం జగన్‌ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగిన మూడురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు మంత్రులు  అందజేశారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తు చెక్కులను అందుకున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న మంత్రులు వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చి ధైర్యం చెప్పారు. 

Read More:
 

* విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

వందల మందిని కాపాడిన పబ్ జీ గేమ్