శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 08:42 AM IST
శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు

కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇకపై వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను ఇకపై పూర్తి సామర్థ్యంతో నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించారు.

అదేవిధంగా రాష్ర్టాలు కోరినట్లుగా చివరి స్టాప్‌(డెస్టినేషన్)లో కాకుండా, ఆ రాష్ట్రంలోని 3స్టేషన్ లలో రైలు ఆగుతుందని తెలిపారు. ప్రత్యేక సోషల్ డిస్టెన్స్ నిబంధనలో భాగంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంచుతూ వస్తున్న మధ్య బెర్తులను కూడా ప్రయాణికులకు కేటాయిస్తామని తెలిపారు. ఒక రైలులో 24 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 72 మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

 ప్రస్తుతం 54 మందికి మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. రోజూ 300 శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామని, సాధ్యమైనంత ఎక్కువ మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలంటే వాటి సంఖ్యను మరింతగా పెంచనున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా మే 1 నుంచి ఇప్పటివరకు సుమారు 5 లక్షల మందిని రైల్వే శాఖ తమ స్వస్థలాలకు చేరవేసింది.

మరోవైపు,కరోనా వ్యాప్తితో ఇన్నిరోజులు నిలిచిపోయిన ప్యాసింజర్ రైల్వే సర్వీసులు మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రైళ్లను క్రమంగా పునరుద్ధరించడానికి భారతీయ రైల్వే రెడీ అయింది. మంగళవారం ( మే 12) నుంచి 15 జంట రైళ్లను (అప్ అండ్ డౌన్ 30 రైళ్లు) ప్రారంభించాలని నిర్ణయించింది.  టికెట్ల బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి IRCTC వెబ్ సైట్ ద్వారా ప్రారంభమవుతాయి. దీని ద్వారానే ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్లలోని టికెట్ల కౌంటర్లు మాత్రం తెరుచుకోవు.

Read More: 

12 నుంచి 15 రైళ్లు ప్రారంభం.. టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే?

రైలు ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే అనుమతి