విశాఖ ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన

విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్ ఆర్ వెంకటాపురంలోనే ఉంది కానీ మమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు.
ఇటు మహిళలైతే కానీ యువకులైతే గానీ మాకు న్యాయం కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. లక్ష్మీ వారం 4 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి అమ్మా మాస్క్ లు కట్టుకొని తొందరగా పారిపొమ్మన్నారని మహిళ చెబుతున్నారు. వారికి ఏమీ తెలియట్లేదని కరోనా గురించే అనుకున్నారని, కరోనా భయంతోనే అనుకున్నారు. తీరా చూస్తే గ్యాస్ ఫామ్ అయ్యింది. వారు భయంతో వణికి పోయారు. వారికి అలారం మోగుతుంది. అలా మోగినప్పుడు మేడ మీదికి వెళతారు. అలా అలారం మూడు సార్లు మోగితే డేంజర్ అని, ఒకసారి మోగితే ఏం ఫర్వాలేదని ఊరుకుంటారు.
అయితే వారికి ఆ అలారం మోగలేదు. వారు 4:30 గంటలకు వారికి పోలీసులు చెప్పగానే అందరూ బయటికి వచ్చారు. ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎవరిని ఇళ్లలో రావొద్దంటే చెట్ల కింద ఉన్నారు. ఆ గ్రామ ప్రజలు ఈ రోజు 9 గంటలకు వచ్చారు. వారు వచ్చే సరికి వారి పంచగ్రామాల్లో వారి ఊరు పేరు లేదన్నారని, దేశమంతా ఆర్ ఆర్ వెంకటాపురం అన్నారు. వారు వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు కూడా చూసుకోవచ్చని చెబుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఆర్ ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అన్నారని అన్నారు. ఈ రోజు వచ్చే సరికి ఆర్ ఆర్ వెంకటాపురం ఎక్కడ కనబడలేదని అన్నారని అన్నారు.
ఈ విషయం తెలిసి వారికి ఆందోళన కలిగిందన్నారు. ఈ రోజు వారి బియ్యం, కూరగాయలు ముక్కబడిపోయి వారు చెత్తకుప్పలో పడేశామని అన్నారు. దీంతో వారు అనాథలుగా ఉన్నామని అన్నారు. ఆ గ్రామంలోని కార్యకర్తలు ఏదో బిర్యాని ప్యాకెట్ లు తెచ్చి పెడితే తింటే తింటున్నామని లేకపోతే లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని అంటున్నారు. కంపెనీ నుంచి ఏమీ వచ్చినా అది తమ ఆర్ ఆర్ వెంకటాపురంకే చెందాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More:
* విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు