9నెలల నిండు గర్భిణీతో ఉన్నా..సేవలు మానని నర్సుకు హ్యాట్సాఫ్

  • Published By: nagamani ,Published On : May 12, 2020 / 05:56 AM IST
9నెలల నిండు గర్భిణీతో ఉన్నా..సేవలు మానని నర్సుకు హ్యాట్సాఫ్

నిండు చూలాలు.. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ..బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ పుట్టబోయే బిడ్డ కోసం కోటి కలలు కంటూ ఉండాల్సిన సమయంలో కూడా వైద్య సేవలు మరుమని మహోన్నత వ్యక్తిత్వం ఈ నర్సు అమ్మది. ఆమె పేరు రూపా పర్వీన్ రావు. తొమ్మిది నెలల గర్భంతో ఉంది. కానీ కరోనా కల్లోలం రేపుతున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన వైద్య సేవల్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు ప్రభుత్వ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న రూప పర్వీన్. 

కర్ణాటక తీర్థ‌హ‌ల్లి తాలూకాలోని గ‌జ‌నూర్ గ్రామానికి చెందిన రూపా ప‌ర్వీన్ రావు తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీ. అయినా సెల‌వు తీసుకోకుండా పలు గ్రామాల పరిధిలో ఉండే  జ‌య‌చామ రాజేంద్ర ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కు సేవలను కొనసాగిస్తోంది. నర్సు అనే మాటకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నిండు గర్భిణీవి..ఈ సమయంలో నీకు విశ్రాంతి చాలా అవసరం సెలవు తీసుకోమ్మా..అని సీనియర్లు చెప్పినా వినలేదు. తన సేవల్ని విడిచిపెట్టలేదు రూపా పర్వీన్. ఆమె సేవల్ని గుర్తించి సీఎం యడ్యూరప్ప ప్రశ్నంసల్ని కూడా అందుకుంది రూపా పర్వీన్.  

ఇదే విషయం రూపా పర్వీన్ ని అడిగితే ఇలా అంటోంది. తొమ్మిది నెలల గర్భంతో సేవలు చేయటం చాలా కష్టం..సెల‌వు తీసుకోమ‌ని సీనియ‌ర్లు చెప్పారు. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకున్నా. రోజూ ఆరు గంట‌లు ప‌నిచేస్తున్నాను..ఈ విషయం తెలిసిన  సీఎం యెడియూర‌ప్ప నాకు ఫోన్ చేసి అభినందించారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. గర్భిణీ విశ్రాంతి తీసుకోవటమే కాదు.. సంతోషంగా..మానసిక సంతృప్తితో ఉంటే ఉంటే పుట్టబోయే బిడ్డ చక్కటి ఆరోగ్యంగా పుడుతుంది.

నేను నా వృత్తిని పూర్తి అంకితభావంతో చేస్తున్నాను..ఎంతో సంతృప్తితో ఉన్నాను. ఇంతకంటే నాకు విశ్రాంతి ఎందుకు? అని నవ్వుతూ అంటోంది.  ఆ…అన్నట్లు సీఎం యడ్యూరప్ప కూడా ఎందుకమ్మా విశ్రాంతి తీసుకోమని సూచించారని..చెబుతోంది రూపా పర్వీన్. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రోగులకు సేవలందిస్తున్న నర్సులకు హ్యాట్సాఫ్..

Read Here>>  కోవిడ్19 కేసులను కట్టడిచేసిన భారత్ తీరు…ప్రశంసనీయం: WHO చీఫ్ సైంటిస్ట్