Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జ్‌లు.. కొత్త కార్యదర్శులుగా మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక జోష్ ను తెలంగాణలో కూడా చూపించి గెలవాలని భావిస్తోంది. దీని కోసం ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించింది.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జ్‌లు.. కొత్త కార్యదర్శులుగా మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్

Telangana congress

Telangana Congress Incharges: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్వరలో జరుగనున్నాయి. దీంతో ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక జోష్ ను తెలంగాణలో కూడా చూపించి గెలవాలని భావిస్తోంది. దీని కోసం ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించింది. కొత్త కార్యదర్శులుగా మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan), పీసీ విష్ణునాథ్ (PC Vishnunadh) లను నియమించింది. కొత్త కార్యదర్శులను నియమించినట్లు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. వీరిలో మన్సర్ అలీఖాది కర్ణాటక కాగా.. విష్ణునాథ్ కేరళకు చెందినవారు.

కర్ణాటక విజయంతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అదే జోరును తెలంగాణలోను చూపించాలనుకుంటోంది. దీంతొ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్‌ పెంచటమే కాదు పెంచింది కూడా. రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది ఏఐసీసీ. రాష్ట్ర వ్యవహారాల కో-ఇంచార్జి ఎన్ఎస్ బోసు రాజుకు కర్ణాటక మంత్రిగా వర్గంలో చోటు దక్కింది. దీంతో ఆయనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించారు. నదీమ్ జావేద్‌కు వేరే బాధ్యతలు అప్పగించేందుకు ఏఐసీసీ ప్లాన్ చేస్తోంది.

Talangana BJP : తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు, అస్సాంలో సీఎం హిమంత బిశ్వశర్మతో ఈటల చర్చలు..

తెలంగాణకు కో-ఇంచార్జిలుగా కొత్తవారిని నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. బోసురాజు, నదీమ్ జావేద్ ల స్థానంలో ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్‌లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

వీరిలో పీసీ విష్ణునాథ్ ఇప్పటి వరకు కర్ణాటక వ్యవహారాల కో-ఇంచార్జ్ గా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటానికి విష్ణునాథ్ భాగస్వామిగా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆయన సేవలను వినియోగించుకోవాలని ఏఐసీసీ భావించింది. దీంట్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.