మహిళతో అసభ్యకరంగా చాటింగ్.. స‌న‌త్‌న‌గ‌ర్ సీఐపై వేటు

సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిపై వేటు పడింది. అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళతో అసభ్యకరంగా చాటింగ్.. స‌న‌త్‌న‌గ‌ర్ సీఐపై వేటు

Sanathnagar CI Purender Reddy

Updated On : July 20, 2024 / 2:49 PM IST

Sanath Nagar Inspector : సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిపై వేటు పడింది. అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ పట్ల సీఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమర్శలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళకు సీఐ అసభ్య చాటింగ్ చేశారు. దీంతో సదరు మహిళ సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది. అంతేకాదు.. సీఐ తనతో చేసిన చాటింగ్ వివరాలను సీపీకి అందించింది.

Also Read : శ్రీవారి లడ్డూకి పూర్వవైభవం తీసుకొస్తాం.. త్వరలోనే హోట‌ల్స్‌కు కొత్త పాలసీ.. : టీటీడీ ఈవో శ్యామలరావు

సీఐ తన చాటింగ్ లో.. అదంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్ కు రావాలి అంటూ మహిళతో పేర్కొన్నాడు. అంతేకాక అసభ్యకరంగా మహిళకు మెస్సేజ్ లు చేసినట్లు తెలిసింది. దీనికితోడు తన కేసులో సీఐ అలసత్వం ప్రదర్శించారని సైబరాబాద్ సీపీకి మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం సీఐపై చర్యలు తీసుకునేందుకు సీపీ నిర్ణయించారు. దీంతో అతన్ని సనత్ నగర్ సీఐ బాధ్యతల నుంచి తప్పిస్తూ సీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.