ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం, ప్రైవేట్ ట్రావెల్స్ కూ అనుమతి, కొత్త నిబంధనలు ఇవే

ఏపీలో ఆర్టీసీ సర్వీసులపై ఓ క్లారిటీ వచ్చింది. బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. బస్సు సర్వీసులపై

  • Published By: naveen ,Published On : May 18, 2020 / 10:16 AM IST
ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం, ప్రైవేట్ ట్రావెల్స్ కూ అనుమతి, కొత్త నిబంధనలు ఇవే

ఏపీలో ఆర్టీసీ సర్వీసులపై ఓ క్లారిటీ వచ్చింది. బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. బస్సు సర్వీసులపై

ఏపీలో ఆర్టీసీ సర్వీసులపై ఓ క్లారిటీ వచ్చింది. బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. బస్సు సర్వీసులపై విధివిధానాలు రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రవాణాకు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. కాగా ఆర్టీసీ ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టారు సీఎం జగన్. ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేయాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఎప్పటి నుంచి బస్సులు అందుబాటులోకి వస్తాయనేది మాత్రం నాలుగు రోజుల్లో వెల్లడిస్తామని సీఎం జగన్ చెప్పారు.

* ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం
* సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలి
* ప్రైవేట్ బస్సుల రవాణకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం
* బస్టాండ్ నుంచి బస్టాండ్ మధ్యనే బస్సులు నడపాలని నిర్ణయం
* బస్సులో ప్రయాణికుల పూర్తి వివరాలు సేకరణ
* ప్రతీ ఆర్టీసీ బస్సులో 20మందికి మాత్రమే 
* కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందే
* బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్కు తప్పనిసరి
* బస్టాండ్ లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి
* దశలవారీగా సర్వీసులు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశం
* ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరుకావాలని సీఎం జగన్ ఆదేశం

దాదాపు రెండు నెలలు.. లాక్ డౌన్ కారణంగా ప్రజారవాణ సర్వీసులు మూత పడ్డాయి. ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కాగా, లాక్ డౌన్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రజా రవాణా అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల పరస్పరం ఒప్పందం మేరకు బస్సులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడపొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులను నడపాలని నిర్ణయించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయాణీకుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.