Sudan’s Khartoum Air Strike: సుడాన్‌లో వైమానిక దాడి..ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మృతి

సూడాన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మరణించారు. సూడాన్ రాజధాని నగరమైన ఖార్తూమ్ లోని నివాస ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలు కూడా మరణించడం సంచలనం రేపింది....

Sudan’s Khartoum Air Strike: సుడాన్‌లో వైమానిక దాడి..ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మృతి

సూడాన్ దేశ నివాసప్రాంతాలపై వైమానిక దాడి

Sudan’s Khartoum Air Strike:సూడాన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మరణించారు. సూడాన్ రాజధాని నగరమైన ఖార్తూమ్ లోని నివాస ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలు కూడా మరణించడం సంచలనం రేపింది. యునైటెడ్ స్టేట్స్ ,సౌదీ అరేబియా 72 గంటల కాల్పుల విరమణ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఈ వైమానిక దాడి జరిగిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Aircraft Crashes In France: ఫ్రాన్స్‌లో కూలిన ఆర్మీ విమానం..ముగ్గురి సైనికుల మృతి

సూడాన్ దేశ యార్మూక్ జిల్లాలో జరిగిన వైమానిక దాడిలో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని ఆ దేశ మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపింది. అక్కడ నివాసితులు శిథిలాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. కార్టూమ్‌లోని మాయో, యార్మౌక్, మండేలా పరిసరాల్లో వైమానిక దాడులకు సుడానీస్ సాయుధ దళాలు కారణమని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆరోపించింది.

Earthquake Hits Ladakh: లడఖ్‌లో నిద్రపోతున్న జనాన్ని వణికించిన భూకంపం

సూడాన్ దేశంలో గత కొంత కాలంగా అంతర్యుద్ధం సాగుతోంది. సూడాన్ దేశంలో పోరాడుతున్న రెండు వర్గాలు సూడాన్‌లో 72 గంటల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఖార్టూమ్‌లోని యూఎస్ ఎంబసీ, సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.కాల్పుల విరమణ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది.కాల్పుల విరమణ సమయంలో తాము దాడులు చేయమని రెండు వర్గాలు తెలిపాయి.