Earthquake Hits Ladakh: లడఖ్‌లో నిద్రపోతున్న జనాన్ని వణికించిన భూకంపం

జమ్మూకశ్మీర్ లోని లడఖ్ ప్రాంత లేహ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లడఖ్‌లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది....

Earthquake Hits Ladakh: లడఖ్‌లో నిద్రపోతున్న జనాన్ని వణికించిన భూకంపం

లడఖ్ ను వణికించిన భూకంపం

Updated On : June 18, 2023 / 5:06 AM IST

Earthquake Hits Ladakh: జమ్మూకశ్మీర్ లోని లడఖ్ ప్రాంత లేహ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లడఖ్‌లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Gusty Winds : ఏపీలో రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు

(Earthquake Hits Ladakh)ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు.దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ లడఖ్ భూకంపాన్ని నిర్ధారించింది. ఈ భూకంపంతో ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి బయటకు పరుగులు తీశారు. లేహ్ లడఖ్ ప్రాంతంలో పర్యటిస్తున్న పర్యాటకులు సైతం భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనలు చెందారు.