Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం..24 గంటల్లో ఐదు భూకంపాలు

వరుస భూకంపాలు జమ్మూకశ్మీరులో కలకలం రేపాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గంటలకు భూకంపం వచ్చింది....

Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం..24 గంటల్లో ఐదు భూకంపాలు

కశ్మీరులో కలకలం...ఐదుసార్లు భూకంపం

Five earthquakes jolt Jammu and Kashmir within 24 hours: జమ్మూకశ్మీరులో 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గంటలకు భూకంపం వచ్చింది.(Five earthquakes) ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైంది.జమ్మూ,కశ్మీర్,లడఖ్(Ladakh) ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఐదుసార్లు తేలికపాటి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

Sudan’s Khartoum Air Strike: సుడాన్‌లో వైమానిక దాడి..ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మృతి

జమ్మూకశ్మీరులో(Jammu and Kashmir) శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పలు సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలో భూకంపం సంభవించిందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో వచ్చింది.లేహ్ లడఖ్ ప్రాంతానికి 271 కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి 9.44 గంటలకు సంభవించిన రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.

Earthquake Hits Ladakh: లడఖ్‌లో నిద్రపోతున్న జనాన్ని వణికించిన భూకంపం

భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గంటలకు భూకంపం వచ్చింది.గత ఐదు రోజులుగా దోడా జిల్లాలో ఏడో సారి భూకంపం సంభవించింది. దోడా జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది. ఈ భూకంపం 18 కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున లడఖ్‌లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలో భూమి కంపించింది.

Aircraft Crashes In France: ఫ్రాన్స్‌లో కూలిన ఆర్మీ విమానం..ముగ్గురి సైనికుల మృతి

లఢఖ్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. జమ్మూకశ్మీరులోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు ఐదవ సారి భూకంపం వచ్చింది. కత్రా ప్రాంత భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఈ భూకంపం 11కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకున్నా కొన్ని భవనాలు ప్రకంపనలకు పగుళ్లు ఇచ్చాయి. రోడ్లు చీలిపోయి గుంతలు పడ్డాయి. వరుస భూకంపాలు ఎందుకు వస్తున్నాయనే విషయంపై భూగర్భ శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు.