నెల రోజులు ఆలస్యమైనా..! ఉచిత బస్సు స్కీమ్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికులకు జీతాలు ప్రభుత్వం ఇచ్చినా.. ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పని చేస్తుందని తెలిపారు.

నెల రోజులు ఆలస్యమైనా..! ఉచిత బస్సు స్కీమ్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Fee Bus Scheme : ఏపీ రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ప్రభుత్వం ఇచ్చినా.. ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పని చేస్తుందని తెలిపారు.

ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి తీరుతామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు స్కీమ్ ఎలా అమలవుతుందో అధ్యయనం చేస్తామని, ఆ తర్వాత ఏపీలో అమలు చేస్తామన్నారు. నెల రోజులు ఆలస్యమైనా.. ఫ్రీ బస్సు పథకాన్ని ఏపీలో పక్కాగా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీని ప్రక్షాళన చేస్తాం- మంత్రి రాంప్రసాద్ రెడ్డి
”ఏ పథకాన్ని అమలు చేస్తున్నామో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఆ సర్వీస్ అమల్లో ఉంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో జరుగుతున్న దాని గురించి మీరు ఎవరినైనా అడగండి. రోజూ డిస్ట్రిక్ ఎడిషన్ లో వార్తలు వస్తున్నాయి. కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. జీరో టికెటింగ్ అంటే ఎలా? బయటి రాష్ట్రాల వారు కూడా ఏపీలో ఉంటారు. వాళ్లకు ఆధార్ కార్డు ఉంటుంది. వాళ్లు బస్సు ఎక్కితే ఒకవేళ దింపేస్తే ఏం చేయాలి? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకే, అధికారికంగా మూడు పొరుగు రాష్ట్రాల్లో పర్యటిస్తాం. ఒక నెల లేదా ఒకటినర్న నెల రోజులు లేటు అయినా.. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం.

జగన్ లా రిబ్బన్ కటింగ్ చేసి వెళ్లిపోయే పరిస్థితి లేదు. కార్మికులు ఆనందంగా ఉంటేనే ఏదైనా సిస్టమ్ బతుకుతుంది. ఆ కార్మికుల వ్యవస్థనే చంపేశారు. జగన్ తన పాదయాత్రలో ఏయే శాఖలో ఎక్కువ ఓటర్లు ఉన్నారో చూసుకుని వారందరికీ ఉచిత హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక ఏపీఎస్ ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదు. ఇవాళ జీతాలు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కానీ, కార్పొరేషన్ పెట్టి, వాళ్ల బంధువును ఛైర్మన్ గా పెట్టుకుని, అక్కడ ఉండే భూములను అనధికారికంగా రాయించుకునే పని చేశారు. కాబట్టి ఆర్టీసీ ప్రక్షాళన అనేది కచ్చితంగా జరుగుతుంది”.

Also Read : వలంటీర్లకు స్వస్తి చెబుతున్న ప్రభుత్వం?