Lawrence Bishnoi : ఎన్ఐఏ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. సాయుధ పోలీసు రక్షణ కావాలనుకునే వారు...తాను బెదిరింపు ఫోన్ కాల్ చేసినందుకు డబ్బు చెల్లిస్తారని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు....

Lawrence Bishnoi : ఎన్ఐఏ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు

Lawrence Bishnoi to NIA

Lawrence Bishnoi : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. సాయుధ పోలీసు రక్షణ కావాలనుకునే వారు…తాను బెదిరింపు ఫోన్ కాల్ చేసినందుకు డబ్బు చెల్లిస్తారని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు. బిష్ణోయ్ ఏప్రిల్‌ నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నారు. ఖలిస్థానీ దుస్తుల నిధులకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ అతన్ని విచారించింది. (Lawrence Bishnoi to NIA)

భటిండా జైలులో లారెన్స్ బిష్ణోయ్

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు బిష్ణోయ్ ప్రస్తుతం భటిండాలోని జైలులో ఉన్నాడు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తాను చేసిన బెదిరింపు కాల్‌కు(Those who wanted police cover) ప్రతిఫలంగా డబ్బు చెల్లించారని ఎన్ఐఏ అధికారులకు చెప్పినట్లు సమాచారం. (would pay me for a threat call) గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపు కాల్ వస్తే తద్వారా వారు పోలీసులను భద్రత కల్పించాలని అడగవచ్చిని అంటున్నారు.

నెలకు రూ.2.5కోట్లు వసూలు చేస్తున్నా…

లారెన్స్ బిష్ణోయ్ ను ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఆ వివరాలను తెలిపారు. మద్యం డీలర్లు, కాల్ సెంటర్ల యజమానులు, డ్రగ్స్ సరఫరాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ప్రతి నెలా తాను రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నట్టు ఎన్ఐఏ విచారణాధికారులకు లారెన్స్ తెలిపాడు. ఈ రోజుల్లో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు రాష్ట్ర పోలీసుల నుంచి భద్రత పొందడానికి వీలుగా తాను బెదిరింపు కాల్‌లు చేసినందుకు, వారు తనకు డబ్బు చెల్లిస్తున్నారని బిష్ణోయ్ పేర్కొన్నాడు.

క్రిమినల్ సిండికేట్ ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998వ సంవత్సరంలో జింకలను వేటాడిన కేసులో బిష్ణోయ్ కమ్యూనిటీకి ఆయన క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. కాగా సల్మాన్ ఖాన్ ను తప్పకుండా హతమారుస్తామని గోల్డీ బ్రార్ ప్రకటించారు. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్లు వారి ప్రత్యర్థులను హతమార్చడానికి వారే తుపాకులతో పాటు షూటర్లను ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసిన కాంట్రాక్టులో తనకు పర్సంటేజీ ఇస్తారని బిష్ణోయ్ చెప్పారు. తాను ఇతర నేరగాళ్లతో కలిసి నేరాల సిండికేట్ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. తాను ఖలిస్థాన్ ఉద్యమానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ఎన్ఐఏకు వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.