Dream Home : శరవేగంగా విస్తరిస్తోన్న విశ్వనగరం.. లక్షలాది మందికి ఉపాధి
Dream Home : ప్రపంచ దేశాల్లో కీలకంగా ఎదుగుతున్న భారత్‌లో నిర్మాణ రంగం సాంకేతికంగా కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా ఈ రంగంలో కేరీర్ ప్రారంభించాలనుకునే వారికి అనేక అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Hyderabad City Development
Dream Home : వ్యవసాయం, పరిశ్రమల తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధిని అందిస్తోన్న రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా భారత దేశ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
ముఖ్యంగా మన విశ్వనగరంలో సంపాదించే ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం కలలు కంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి నిర్మాణం లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయడం ప్రస్తుతం సెంటిమెంట్‌గా మారింది. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో రియాల్టీ రంగం ఫుల్ జోష్‌లో ఉంది.
Read Also : Dream Home : హైదరాబాద్‌లో ఇళ్లు కొనేటప్పుడు ధరలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి
ప్రపంచ దేశాల్లో కీలకంగా ఎదుగుతున్న భారత్‌లో నిర్మాణ రంగం సాంకేతికంగా కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా ఈ రంగంలో కేరీర్ ప్రారంభించాలనుకునే వారికి అనేక అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించడం, ప్రణాళికలు, వర్చువల్ రియాలిటీ టూర్‌లు, ఆన్‌లైన్ ప్రాపర్టీ లిస్టింగ్‌లు, సివిల్ ఇంజనీరింగ్‌లో కూడా కొత్త కొత్త పద్ధతులు అనుసరించడం.. మార్కెట్లోకి వచ్చిన ప్రతి న్యూ స్కిల్‌ను డెవలప్ చేసుకోవడం ద్వారా రియాలిటి రంగం మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలను కల్పిస్తుందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్.
నిర్మాణ రంగంలో కేవలం సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ విభాగం, ఇంటీరియర్ డిజైన్ అండ్ మేకింగ్, మెయింటనెన్స్, కార్పెంటర్, ప్లంబింగ్, వాటర్ ప్రూఫింగ్ రంగాల్లో అనేక కొత్త కొత్త ఉపాధి నిర్మాణ రంగంలో ఉన్నాయి. అయితే నిర్మాణ రంగం ఎప్పటికప్పుడు మారుతుండటం.. అందుకు అనుగుణంగా ఈ రంగంలో మార్పులు జరగుతుండటంతో ఈఇండస్ట్రీలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ట్రెండ్‌కు అనుగుణంగా ఇండస్ట్రీలో చేంజెస్ జరిగితే మరింత ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కాదు.. నిరుద్యోగ సమస్యను తీరుస్తూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది రియాల్టీ రంగం. ప్రస్తుతం రియాల్టీ రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వృతి నిపుణుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భవిష్యత్తులోనూ ఈ రంగం భారీగా విస్తరించే అవకాశం ఉండటంతో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఫుల్ టెక్నికల్ నిపుణులకు డిమాండ్ మరింత పెరుగుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
Read Also : Affordable House Market : అఫర్డబుల్ హౌసింగ్‌కు మారు పేరుగా హైదరాబాద్