Malaika Arora : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసేందుకు.. మలైకా ఎంత ఖర్చు చేసి డ్రెస్ కొన్నదో తెలిస్తే షాక్ అవుతారు!
బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో మెరిసేందుకు మలైకా అరోరా వేలు ఖర్చు చేసి ఒక డ్రెస్ కొన్నది. అంతేకాకుండా పార్టీలో తన సూపర్ హిట్ సాంగ్ చైయ్య చైయ్యకి అదిరే స్టెప్పులు వేసి మెస్మరైజ్ చేసింది.
![Malaika Arora : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసేందుకు.. మలైకా ఎంత ఖర్చు చేసి డ్రెస్ కొన్నదో తెలిస్తే షాక్ అవుతారు! Malaika Arora : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసేందుకు.. మలైకా ఎంత ఖర్చు చేసి డ్రెస్ కొన్నదో తెలిస్తే షాక్ అవుతారు!](https://10tv.in/wp-content/uploads/2023/07/Malaika-Arora-dress-cost-where-she-wore-at-Arjun-Kapoor-birthday-party.jpg)
Malaika Arora dress cost where she wore at Arjun Kapoor birthday party
Malaika Arora : బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ (Arjun Kapoor) డేటింగ్ వార్త గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 48 ఏళ్ల వయసు ఉన్న మలైకా.. తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేయడం పై చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. ఎవరు ఏమనుకున్నా వీరిద్దరూ మాత్రం అవేవి పట్టించుకోకుండా వారి దారిలో వాళ్ళు వెళ్లిపోతున్నారు. కాగా జూన్ 26న అర్జున్ బర్త్ డే పార్టీ జరిగింది. ఇక ఈ సెలబ్రేషన్ లో మెరిసేందుకు మలైకా వేలు ఖర్చు చేసి ఒక డ్రెస్ కొన్నది.
Niharika – Chaitanya : నాలుగు నెలల తర్వాత నిహారిక భర్త చైతన్య వైరల్ పోస్ట్.. మెడిటేషన్ సెంటర్లో!
ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో మలైకా వేసిన డ్రెస్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఆ డ్రెస్ ని ‘స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవే’ నుంచి వచ్చినది. ఆ డ్రెస్ ని ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అని పిలుస్తారట. దీని ఖర్చు వచ్చి ఇండియన్ కరన్సీలో అక్షరాల 99 వేలు. ఈ రేటు తెలుసుకొని నెటిజెన్లు షాక్ అవుతున్నారు. సింపుల్ గా ఉన్న ఆ డ్రెస్ అంత రేటా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Bro Movie : మరో మూడు వారాల్లో రిలీజ్.. ఇంకా పూర్తి కానీ షూటింగ్.. ఫారిన్లో బ్రో సాంగ్ మేకింగ్..
ఇక ఈ డ్రెస్ లో మలైకా తన సూపర్ హిట్ సాంగ్ ‘చైయ్య చైయ్య’ (Chaiya Chaiya) కి అదిరే స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఆ కాస్టలీ డ్రెస్ లో మలైకా తన ఒంపు సొంపులను చూపిస్తూ డాన్స్ వేస్తుంటే నెటిజెన్స్ అంతా చూసి ఫిదా అవుతున్నారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.
View this post on Instagram