CM Revanth Reddy : టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి..

గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

CM Revanth Reddy : టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి..

CM Revanth Reddy

Updated On : July 30, 2024 / 12:49 PM IST

గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ‌ద్ద‌ర్ అవార్డు ల‌పై స్పందించారు.

ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను ముఖ్య‌మంత్రి కోరారు. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర ప‌రిశ్ర‌మ స్పందించ‌లేదు.

Mahesh Babu : ధ‌నుష్ ‘రాయ‌న్’ మూవీపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు రివ్యూ..

ఈ క్ర‌మంలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌ధానోత్స‌వ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మౌనంగా ఉండ‌డం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన‌ట్లుగా చెప్పారు. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమ‌న్నారు.