Bengal Panchayat Polls : కేంద్ర భద్రతా బలగాల పహరా మధ్య పంచాయతీ పోలింగ్ ప్రారంభం

హింకాండ నేపథ్యంలో శనివారం కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి....

Bengal Panchayat Polls : కేంద్ర భద్రతా బలగాల పహరా మధ్య పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Bengal Panchayat Polls

Bengal Panchayat Polls : సాహింకాండ నేపథ్యంలో శనివారం కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి. 22 జిల్లా కౌన్సిళ్లు, 9,730 బ్లాక్ కౌన్సిళ్లు, 63,229 గ్రామాల్లో జరుగుతున్న పోలింగులో 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. (Voting Today As Situation Tense In Many Areas) జులై 11వతేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Karnataka Heavy Rains : కర్ణాటకలో భారీవర్షాలు..8మంది మృతి

జూన్ 8వతేదీన ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి బెంగాల్ రాష్ట్రంలో హింసాకాండ, హత్యలు జరిగాయి. మైనర్‌తో సహా డజనుకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అభివృద్ధి, అవినీతి అంశాలపై బీజేపీ ప్రచారం చేసింది. కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు కూడా తమ వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాయి. బెంగాల్ రాష్ట్రంలో హింసాకాండ నివారణకు గవర్నర్ సీవీ ఆనందబోస్ క్రియాశీల పాత్ర పోషించారు.

President Joe Biden : యూఎస్ అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేసింది..జో బిడెన్ వెల్లడి

శనివారం నాటి పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌లు, బుల్లెట్‌ల మధ్య పోరుగా అభివర్ణించిన గవర్నర్, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని పర్యవేక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ జిల్లా షంషేర్‌గంజ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఓ ఇల్లు ధ్వంసమైంది.

Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్యూటీలోఉన్న ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి

నార్త్ పరగణాస్ లోని 271, 272 పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు, బాక్సులను బలవంతంగా ఎత్తుకెళ్లారు. కూచ్ బెహార్ ప్రాంతంలో జరిగిన హింసాకాండలో సీపీఐఎం కార్యకర్త హఫీజుర్ రహమాన్ గాయపడ్డారు. కూచ్ బెహార్ లో టీఎంసీ బూత్ కమిటీ ఛైర్మన్ హత్యకు గురయ్యారు.