Parakramam Song : బండి సరోజ కుమార్ ‘పరాక్రమం’ నుంచి.. ‘మనిషి నేను..’ ఎమోషనల్ సాంగ్ విన్నారా?

తాజాగా పరాక్రమం సినిమా నుంచి మనిషి నేను.. అనే ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేసారు.

Parakramam Song : బండి సరోజ కుమార్ ‘పరాక్రమం’ నుంచి.. ‘మనిషి నేను..’ ఎమోషనల్ సాంగ్ విన్నారా?

Bandi Saroj Kumar Parakramam Movie Manishi Nenu Song Released

Updated On : July 19, 2024 / 7:32 PM IST

Parakramam Song : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ త్వరలో ‘పరాక్రమం’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. గల్లీ క్రికెట్, లవ్, నాటకాలు కాన్సెప్ట్ తో పరాక్రమం సినిమాని తెరకెక్కిస్తున్నారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Average Student Nani Song : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ విన్నారా?

ఇప్పటికే పరాక్రమం సినిమా నుంచి టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి మనిషి నేను.. అనే ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాటని బండి సరోజ్ కుమార్ స్వయంగా రాసి సంగీతం అందించగా హైమత్ మహమ్మద్ పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఈ సాంగ్ విడుదల సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. పరాక్రమం సినిమా నుంచి నేను నేను రాసి స్వరపరిచిన ‘మనిషి నేను..’ అనే పాటను విడుదల చేసాము. ఈ పాట అందరికి నచ్చుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. సినిమాని ఆగస్టు లో రిలీజ్ చేస్తాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తాం అని తెలిపారు.