Average Student Nani Song : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ విన్నారా?

తాజాగా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు.

Average Student Nani Song : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ విన్నారా?

Melody Song From Average Student Nani Released

Updated On : July 19, 2024 / 6:34 PM IST

Average Student Nani Song : మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో రాబోతున్నాడు. సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా, ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని తనే నిర్మించడం విశేషం.

Also Read : Aham Reboot : ఆహాలో ఏకంగా అన్ని కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో.. సుమంత్ సరికొత్త రికార్డ్..

‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమాని యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా తాజాగా ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు. సారా సారా.. అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రాయగా కార్తిక్ సంగీత దర్శకత్వంలో పద్మలత, అనుదీప్ దేవ్ పాడారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మీరు కూడా ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ వినేయండి..